Harish Rao : చికెన్ తింటే ఏం కాదు.. లైవ్ లో తిని చూపించిన హరీష్ రావు!

చికెన్ తింటే ఎలాంటి  హాని లేదన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే, హరీష్ రావు. చికెన్ తింటే బ్లర్డ్ ఫ్లూ వస్తుందంటూ సోషల్ మీడియాలో వచ్చే అపోహలను నమ్మవద్దన్నారు.  సిద్దిపేట జిల్లా పౌల్ట్రీ రైతుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత చికెన్ & ఎగ్ మేళాలో పాల్గొన్నారు

New Update
harish rao chicken mela

చికెన్ (Chicken) తింటే ఎలాంటి  హాని లేదన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao). చికెన్ తింటే బ్లర్డ్ ఫ్లూ వస్తుందంటూ - సోషల్ మీడియాలో వచ్చే అపోహలను నమ్మవద్దన్నారు.  సిద్దిపేట జిల్లా పౌల్ట్రీ రైతుల ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ఉచిత చికెన్ & ఎగ్ మేళాలో హరీష్ రావు పాల్గొన్నారు.  -ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. చికెన్, ఎగ్- బాగా ఉడక పెట్టి తింటే ఎలాంటి వైరస్ సోకదన్నారు.  

Also Read :  వెయ్యి రోగాలను నయం చేసే కాయ.. వేసవిలో తింటే ఆరోగ్యం మీ సొంతం

బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం పౌల్ట్రీ రైతులకు మక్కలు, విద్యుత్ సబ్సిడీపై ఇచ్చిందని హరీష్ గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పౌల్ట్రీ రైతులను పట్టించుకోలేదని విమర్శించారు. గతంలో అపోహాలు వస్తే కేసీఆర్ తో పాటు ప్రజా ప్రతినిధులు అంతా చికెన్ తిని అపోహాలను దూరం చేసి ప్రజలకు నమ్మకం కల్పించామని హరీష్ గుర్తుచేశారు.  

Also Read :  టన్నెల్‌లో మృతదేహాలు లభించాయనేది అవాస్తవం  :  కలెక్టర్‌ క్లారిటీ!

అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రోటీన్ ఇచ్చేది చికెన్, కోడిగుడ్డు మాత్రమేనని అన్నారు హరీష్.  చికెన్, ఎగ్- 70 డిగ్రీల వరకు ఉడక పెడితే ఎలాంటి వైరస్ ఉండదని ప్రపంచ ఆరోగ్య సంస్థనే( డబ్ల్యూహెచ్వో ) చెప్పిందని తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని... రైస్, రోటి కంటే చికెన్ & గుడ్డే ఆరోగ్యానికి మేలని వెల్లడించారు.  రాష్ట్రంలోనే రెండవ అతిపెద్ద పౌల్ట్రీ సిద్దిపేట జిల్లాలోనే ఉందని చెప్పిన హరీష్...చికెన్ తింటే ఎలాంటి  హాని లేదని.. తాను కూడా చికెన్ తింటున్నానని.. మీరందరూ కూడా తినాలని పిలుపునిచ్చారు. 

Also Read :  మైక్రోసాఫ్ట్ కీలక నిర్ణయం.. ఇక ఆ సేవలకు గుడ్‌బై !

వెలవెలబోతున్న చికెన్ సెంటర్లు

కోళ్లకు వైరస్‌ సోకుతుందనే అనే ప్రచారం బాగా జరగడంతో  జనాలు చికెన్‌ తినేందుకు ఇప్పటికీ  భయపడుతున్నారు.  అంతకుముందు ఆదివారం పూట కళకళలాడిన చికెన్ సెంటర్లు ఇప్పుడు ఖాళీగా వెలవెలబోతున్నాయి. పెద్దగా చికెన్ సెంటర్ల వద్ద రష్ కనిపించడం లేదు. చికెన్ ధరలు తగ్గించినప్పటికీ జనాలు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. చికెన్ ధరలు పడిపోవడంతో చేపలకు డిమాండ్ పెరిగిపోయింది.  దీంతో మార్కెట్ లో కిలో చేపలు రూ.  300 వరకు పలుకుతోంది.  

Also Read :  Fake RMPs : రాష్ట్రంలో నకిలీ ఆర్ఎంపీలు... 15 మంది పై మెడికల్ కౌన్సిల్ కేసులు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు