Fake RMPs : రాష్ట్రంలో నకిలీ ఆర్ఎంపీలు... 15 మంది పై మెడికల్ కౌన్సిల్ కేసులు

గ్రామాల్లో జ్వరం, ఒళ్లునొప్పులు, వ్యాధి ఏదైనా ముందుగా వెళ్లేది దగ్గర్లోని ఆర్‌ఎంపీ వద్దకే. రోగాలను నయం చేస్తారనే భరోసాతో వేలకు వేలు ఫీజులు చెల్లిస్తున్నారు. తాజాగా నకిలీ డిగ్రీలతో చికిత్స చేస్తున్న ఆర్‌ఎంపీ, పీఎంపీలపై మెడికల్‌ కౌన్సిల్‌ కొరడా ఝలిపించింది.

New Update
 FAKE DOCTORS

FAKE DOCTORS

 Fake RMPs : గ్రామాల్లో జ్వరం, ఒళ్లునొప్పులు, ఇలా వ్యాధి ఏదైనా ముందుగా వెళ్లేది దగ్గర్లోని ఆర్‌ఎంపీ వద్దకే. రోగాలను నయం చేస్తారనే భరోసాతో వైద్యుడి దగ్గరకు వెళ్లి వేలకు వేలు ఫీజులు చెల్లిస్తున్నారు అయితే కొన్ని సంఘటనల వల్ల చికిత్స చేస్తున్నది నిజంగా వైద్యుడా లేదా నకిలీ వైద్యుడా అనే అనుమానం వస్తుంది. తాజాగా నకిలీ డిగ్రీలతో చికిత్స చేస్తున్న ఆర్‌ఎంపీ, పీఎంపీలపై మెడికల్‌ కౌన్సిల్‌ కొరడా ఝలిపించింది.

Also Read: తాగొచ్చి కొట్టేవాడు...ఇంటినుంచి గెంటేశాడు.. మానవ్ శర్మ భార్య సంచలన కామెంట్స్

Fake RMPs In Telangana

గత కొన్ని నెలలుగా నకిలీ వైద్యులపై తరచూ తనిఖీలు చేసి కేసులు నమోదు చేస్తున్న తెలంగాణ మెడికల్‌ కౌన్సిల్‌ ఈ మేరకు కేసులు నమోదు చేసినట్లు టీజీఎంసీ వైస్ చైర్మన్ డా. జి. శ్రీనివాస్ శుక్రవారం తెలిపారు. పలువురి నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా మెడికల్ కౌన్సిల్ అధికారులు గత నెలలో జీడిమెట్ల, మియాపూర్, గజ్వెల్, నిజామాబాద్‌ తదితర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నకిలీలు అని తేలిన వారిపై ఆయా పోలీస్ స్టేషన్ ఫరిధిలో ఎన్ఎంసి చట్టం 34,54 టిఎస్ఎంపిఆర్(TSMPR) చట్టం 22 ప్రకారం కేసులు నమోదు చేశామని వెల్లడించారు. మరికొంత మంది ఆర్ఎంపీలు, పీఎంపీలు తమ పరిధి దాటి వైద్యం చేస్తున్నారని, రాష్ట్రంలో పూర్తిగా ఎన్ఎంసీ చట్టాన్ని అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 400 మందికి పైగా కేసులు వేసినప్పటికి ఆర్ఎంపీలు, పీఎంపీలు తమ తీరు మార్చుకోకుండా పరిధి దాటి వైద్యం చేస్తూ అమాయక ప్రజల అవసరాన్ని సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు.

Also Read :  ప్రాణాలంటే కాంగ్రెస్ నాయకులకు లెక్కలేదు- ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు

Also read :  నామినేటెడ్‌ పదవులు వాళ్లకే.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

ఆర్ఎంపీలు ఎలాంటి విద్యార్హతలు లేకుండా ఎంబీబీఎస్ డాక్టర్ల మాదిరిగా అశాస్త్రీయంగా వైద్యం చేస్తున్నారన్నారు. దీనివల్ల చాలాసార్లు వైద్యం వికటించడం, ఒక్కోసారి చనిపోవడం జరుగుతుందన్నారు. వారి వద్దకు వచ్చే రోగులకు ఇష్టారీతిన యాంటీబయోటిక్స్, స్టెరాయిడ్స్, ఇంజెక్షన్స్ ఇవ్వడం ద్వారా ప్రజారోగ్యానికి పెనుముప్పు వాటిల్లుతుందన్నారు.ప్రజారోగ్యాన్ని పరిరక్షించే బాధ్యత మన అందరి పైన ఉందని, ఎన్ఎంసి చట్టం ప్రకారం ఎంబీబీఎస్ విద్య అభ్యసించకుండా అల్లోపతి వైద్యం చేయరాదని, ఆర్ఎంపీ, పీఎంపీ అని చెప్పుకుంటూ నకీలీ వైద్యులు మెడికల్ ప్రాక్టీషనర్ అని వ్రాసుకునే అర్హత లేదన్నారు. ఎన్ఎంసి చట్టం, గతంలో కోర్టులు ఇచ్చిన తీర్పుల ప్రకారం ఎటువంటి విద్యార్హత లేని నకిలీలకు శిక్షణ ఇవ్వడం, వారికి గుర్తింపు ఇవ్వడం చట్ట విరుద్ధమని తెలిపారు. ఎవరైనా అలా చేస్తే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. పలువురు ఆర్‌ఎంపీలు కనీస విద్యార్హత లేకున్నా వైద్యులుగా చేస్తూ మందుల చీటీలు రాయకుండానే ఔషధాలు అమ్మినట్లు తేలింది. వారి ఔషధ దుకాణాల్లో ఫార్మాసిస్టులు కూడా లేకపోవడంతో డ్రగ్‌ కంట్రోల్‌ అథారిటీ, ఫార్మసీ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు.

Also read :  జనాన్ని నమ్మించి నట్టేట ముంచిన కూటమి ప్రభుత్వం...రోజా సంచలన ఆరోపణలు

Also read :   కిషన్ రెడ్డివల్లే తెలంగాణకు అన్యాయం-రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు