Microsoft: మైక్రోసాఫ్ట్ కీలక నిర్ణయం.. ఇక ఆ సేవలకు గుడ్‌బై !

మైక్రోసాఫ్ట్‌కు చెందిన వీడియో కాన్ఫరెన్సింగ్ ప్లాట్‌ఫామ్‌ 'స్కైప్‌' సేవలు త్వరలో శాశ్వతంగా నిలిచిపోనున్నాయి. మే నుంచి ఈ సేవలు నిలిచిపోయే అవకాశం ఉన్నట్లు సమాచారం. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
Microsoft is finally shutting down Skype in May

Microsoft is finally shutting down Skype in May

ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌కు చెందిన వీడియో కాన్ఫరెన్సింగ్ ప్లాట్‌ఫామ్‌ స్కైప్‌ గురించి అందరికీ తెలిసిందే. అప్పట్లో వీడియో కాల్స్‌ మాట్లాడేందుకు చాలామంది ఈ యాప్‌ను వినియోగించేవారు. అయితే ఈ సేవలకు ఇక మైక్రోసాఫ్ట్‌ గుడ్‌ బై చెప్పనుంది. త్వరలోనే స్కైప్‌ ప్లాట్‌ఫామ్‌ను శాశ్వతంగా నిలిపివేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఎక్స్‌డీఏ తన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది.

Also Read: తాగొచ్చి కొట్టేవాడు...ఇంటినుంచి గెంటేశాడు.. మానవ్ శర్మ భార్య సంచలన కామెంట్స్

2003లో స్రైప్‌ వీడియో కాన్ఫరెన్సింగ్‌ సేవలను ప్రారంభించింది. ఆ తర్వాత 2011లో మైక్రోసాఫ్ట్‌ ఈ సర్వీసుల్ని కొనుగోలు చేసింది. 22 ఏళ్లుగా స్కైప్ తన సేవల్ని అందిస్తూ వస్తోంది. 2017లో మెక్రోసాఫ్ట్‌ టీమ్స్‌ లాంచ్ అయిన సంగతి తెలిసిందే. దీంతో అప్పటినుంచి స్కైప్ అంతర్గతంగా పోటీ ఎదుర్కోంటూనే ఉంది. దీనివల్ల క్రమంగా జనాల్లో కూడా స్కైప్‌కు ఉన్న ఆదరణ తగ్గుతూ వచ్చింది. ఎప్పుడు స్కైప్‌ను మూసివేస్తారా అనే ప్రచారాలు కూడా జరిగాయి.

Also Read: ఉత్తరాఖండ్‌లో దారుణం.. హిమపాతంలో చిక్కుకున్న 57 మంది కార్మికులు

అంతేకాదు ప్రస్తుత రోజుల్లో చూసుకుంటే వాట్సాప్, గూగుల్‌ మీట్‌ ఫ్లాట్‌ఫాం నుంచి కూడా చాలామంది వీడియో కాన్ఫరెన్స్‌ సేవలను వినియోగించుకుంటున్నారు. మొత్తంగా చూసుకంటే స్కైప్‌కు మొదట్లో ఉన్న జనాధారణ ఇప్పుడు లేదు. అందుకే ఈ ప్లాట్‌ఫాం సేవలకు మైక్రోసాఫ్ట్‌ గుడ్‌బై చెప్పేందుకు రెడీ అయిపోయింది. అయితే మే నుంచి ఈ సేవలు నిలిచిపోయే అవకాశం ఉన్నట్లు సమాచారం. 

Also Read: గజగజ వణికిస్తున్న భారీ అగ్ని ప్రమాదం.. 42వ అంతస్తులో ఎగసిపడిన మంటలు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు