Charminar Fire Accident: హైదరాబాద్‌లోని చార్మినార్ గుల్జార్ హౌస్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 17 మంది మృతి చెందారు. మరి కొందరికి తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. కాగా సంఘటన స్థలానికి వెళ్లిన మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రమాదంపై ఆరాతీశారు. అగ్ని ప్రమాద ఘటన పై అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలతో మాట్లాడి వారికి అండగా ఉంటామని మాట ఇచ్చారు. గాయపడిన వారికి నాణ్యమైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధిత కుటుంబాలతో ఫోన్ లో మాట్లాడారు.
ఇది కూడా చూడండి: Hydra: చెరువుల్లో వ్యర్థాలు, మట్టి పోస్తే జైలుకే.. హైడ్రా సంచలన నిర్ణయం!
Ponnam Prabhakar's Key Statement On Gulzaari House Fire Accident
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఉదయం పూట 6:16 గంటలకు ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం జరిగిందన్నారు. సమాచారం రాగానే వెనువెంటనే నిమిషాల్లో ఫైర్ సిబ్బంది వచ్చి అగ్ని ప్రమాద నివారణ చర్యలు చేపట్టి మంటలు ఆర్పేశారని వివరించారు. గుల్జారీ హౌస్‌లో నివసిస్తున్న వారిలో17 మంది కి తీవ్ర గాయాలయ్యాయని వివరించారు. వారందరినీ హాస్పిటల్ కి తరిలించామని తెలిపారు.ప్రస్తుతం వారందరికీ హాస్పిటల్ లో చికిత్స అందిస్తున్నారని మంత్రి పొన్నం వివరించారు. అగ్ని ప్రమాదంలో చాలామంది మరణించారని సమాచారం ఉందన్న మంత్రి ప్రభుత్వం తరుపున అని రకాల చర్యలు చేపట్టామన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధిత కుటుంబాలతో మాట్లాడారని వివరించారు.
ఇది కూడా చూడండి: Rahul Gandhi: ముందు సమాచారం ఇవ్వడం ఏంటి...ఆపరేషన్ సింధూర్ పై రాహుల్ గాంధీ..
వెంటనే చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి తనకు, అధికారులకు ఆదేశాలు జారీ చేశారన్నారు.. అన్ని రకాల చర్యలు తీసుకుంటూ బాధిత కుటుంబాలకు ఎక్కడ ఇబ్బందులు కలగకూడదని ఆదేశాలు జారీ చేశారన్నారు.వైద్య శాఖ అధికారులు ,పోలీసులు , ఫైర్ అధికారులు అక్కడే ఉండి తగిన చర్యలు చేపడుతున్నారని వివరించారు. అగ్ని ప్రమాదంలో కుట్ర కోణం ఏం లేదన్న మంత్రి ప్రమాదవశాత్తు జరిగినట్లే భావిస్తున్నామన్నారు. అధికారులు నిర్లక్ష్యం చేయకుండా ప్రమాదాన్ని తగ్గించారన్నారు.వారి కుటుంబాలను ఆడుకోవడానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
ఇది కూడా చూడండి: Niharika: బన్నీతో లవ్, ప్రభాస్‌తో అది చేయాలనుంది.. మెగా డాటర్ నిహారిక షాకింగ్ కామెంట్స్!
చనిపోయిన వారికి రాష్ట్ర ప్రభుత్వం సంతాపాన్ని తెలుపుతుందన్న మంత్రి పొన్నం ప్రభాకర్ ఘటనలో 17 మంది తీవ్రంగా గాయపడి మృతి చెందారని వివరించారు. అయితే మృతుల సంఖ్య అధికారికంగా వెల్లడికావాలసి ఉందన్నారు. సంఘటన జరగగానే అన్న డిపార్ట్మెంట్ లు తక్షణం స్పందించాయని తెలిపారు. పిల్లలకు వేసవి సెలవులు కావడంతో వచ్చి ఇక్కడ ఉన్నారన్నారు. అందులో నాలుగు ఉమ్మడి కుటుంబాలు ఉన్నట్లు తెలుస్తుందని, మంది ఎక్కువగా ఉండడం వల్లే ప్రాణనష్టం ఎక్కువగా జరిగిందని మంత్రి పొన్నం ప్రభాకర్ వివరించారు.
ఇది కూడా చూడండి: RCB VS KKR: అయ్యో కేకేఆర్...టాస్ కూడా పడకుండానే మ్యాచ్ వర్షార్పణం
A major fire broke out in a residence behind Ikram Jewellers near Gulzar Houz, Charminar. Several victims, including children, were affected. Emergency services and locals responded swiftly, shifting victims to nearby hospitals. Rescue operations are ongoing.#Hyderabad pic.twitter.com/sw1x7yJh45
— Habeeb Masood Al-Aidroos (@habeeb_masood) May 18, 2025
telugu crime news | telangana crime news | telangana-crime | Fire Acc!dent | crime news | Latest crime news