/rtv/media/media_files/2025/08/21/good-news-for-transgenders-2025-08-21-20-36-58.jpg)
Good news for transgenders.
Transgenders jobs : తెలంగాణ ప్రభుత్వం ట్రాన్స్‌జెండర్లకు మరో గుడ్‌న్యూస్ చెప్పింది. సమాజంలో సరైన ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న వారి కోసం మరిన్ని ఉపాధి అవకాశాలను అందించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. వారికి ప్రభుత్వ కార్యాలయాల్లో అవసరమైన సెక్యూరిటీ రంగంలో ఉద్యోగాలు కల్పించనున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో పలువురు ట్రాన్స్ జెండర్లను ట్రాఫిక్ అసిస్టెంట్లుగా నియమించింది. ఆ ట్రాన్స్‌జెండర్లు గత ఎనిమిది నెలలుగా హైదరాబాద్‌లో విజయవంతంగా పనిచేస్తున్నారు.
Also Read : AP Cabinet : ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..మావోయిస్టుల కోసం ప్రత్యేక కోర్టు
వారి క్రమశిక్షణ, పనితనం, కట్టుదిట్టమైన విధానాలు ప్రభుత్వానికి నమ్మకాన్ని కల్పించాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు వారికి ఇతర విభాగాల్లోనూ అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పించింది. ముఖ్యంగా జీహెచ్‌ఎంసీ (GHMC), ఆర్టీసీ (RTC), హెచ్‌ఎండీఏ (HMDA)తదితర రంగాలలో ట్రాన్స్‌జెండర్లను సెక్యూరిటీ ఉద్యోగాలలో నియమించాలని సర్కార్ రంగం సిద్ధం చేసింది. జీహెచ్‌ఎంసీలో 25 ఉద్యోగాలు, ఆర్టీసీలో 20 ఉద్యోగాలు ప్రస్తుతానికి ఖాళీ ఉన్నాయి. ఈ పోస్టులను అర్హులైన ట్రాన్స్ జెండర్లకు ఇవ్వాలని ప్రభుత్వం సిద్ధమైనట్టు సమాచారం. ముఖ్యమంత్రి ఆమోదం తెలిపిన వెంటనే ఈ పథకం అమల్లోకి అవకాశం ఉందని తెలుస్తోంది.
ప్రభుత్వం చెబుతున్నదాన్ని బట్టి దశలవారీగా ప్రైవేట్ రంగం - ముఖ్యంగా ఐటీ కంపెనీలలో సెక్యూరిటీ విభాగంలో ట్రాన్స్‌జెండర్లకు అవకాశాలు కల్పించనున్నారు. ఈ క్రమంలో, వారి విద్యార్హతలు, నైపుణ్యాల ఆధారంగా ప్రత్యేక శిక్షణ ఇచ్చి వారిని ప్రొఫెషనల్‌గా తయారు చేస్తారు. దీని వల్ల ట్రాన్స్‌జెండర్లు కేవలం ఉపాధి పొందడమే కాకుండా, ఆర్థిక స్థిరత్వం, సమాజంలో గౌరవం పొందే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నిర్ణయం వల్ల ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీకి భిక్షాటన, వినోదరంగంలో మాత్రమే అవకాశాలు ఉంటాయనే ముద్రను చెరిపేసే అవకాశం ఉంటుందని అధికారులు అంటున్నారు.
Also Read : Crime : ఎంతకు తెగించావ్ రా... అక్రమ సంబంధానికి ఒప్పుకోలేదని చంపేశాడు!
కాగా, ప్రభుత్వ నిర్ణయంపై LGBTQ కమ్యూనిటీకి చెందిన పలువురు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు ఉపాధి అవకాశాల కోసం ఎదురుచూస్తున్న చాలా మంది ట్రాన్స్‌జెండర్లకు ఇది ఒక మంచి అవకాశమని వారంటున్నారు. ఇప్పటికే ట్రాన్స్‌జెండర్ల కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక ఉపాధి కార్యక్రమాలు చేపట్టిందని, ఈ జాబితాలో ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు కూడా చేరడంతో, ట్రాన్స్‌జెండర్ల సాధికారత దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసిందని సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. మొత్తానికి ఈ నిర్ణయం తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఇన్‌క్లూజివ్ పాలసీకి ఆదర్శంగా నిలిచే అవకాశముందని భావిస్తున్నారు.
Also Read: Neha Sharma: డైరెక్టర్ గా మారిన రామ్ చరణ్ ఫస్ట్ హీరోయిన్.. ఏకంగా స్టార్ హీరోతోనే సినిమా!