Crime : ఎంతకు తెగించావ్ రా...  అక్రమ సంబంధానికి ఒప్పుకోలేదని చంపేశాడు!

కర్ణాటకలో దారణం జరిగింది. తన రిక్వెస్ట్ ను ఒప్పుకోలేదని ఓ వివాహితను చంపేశాడో ప్రబుద్ధుడు. ఈ సంఘటన బుధవారం హసన్ జిల్లాలోని చందనహళ్లి ప్రాంతంలో జరిగింది. శ్వేత, రవిలకు చాలా ఏళ్లుగా పరిచయం ఉంది.

New Update
karnataka

కర్ణాటకలో దారణం జరిగింది. తన రిక్వెస్ట్ ను ఒప్పుకోలేదని ఓ వివాహితను చంపేశాడో ప్రబుద్ధుడు. ఈ సంఘటన బుధవారం హసన్ జిల్లాలోని చందనహళ్లి ప్రాంతంలో జరిగింది. శ్వేత, రవిలకు చాలా ఏళ్లుగా పరిచయం ఉంది. రవికి పెళ్లై పిల్లలు ఉండగా.. శ్వేత తన భర్త నుండి విడిపోయి తల్లిదండ్రులతో నివసిస్తోంది. అయితే గత కొన్ని నెలలుగా, రవి బాధితురాలిని తనతో రిలేషన్ షిప్ లో ఉండమని అవవసరం అయితే తన భార్యను వదిలివేస్తానంటూ ఒత్తిడి చేస్తున్నాడు. అయితే శ్వేత అతని ప్రతిపాదనను తిరస్కరించింది. రవితో సంబంధం పెట్టుకోవడానికి శ్వేత ఇష్టపడలేదు.

చంపేయాలని ప్లాన్

దీంతో ఆమెపై కోపం పెంచుకున్న రవి, శ్వేతను చంపేయాలని ప్లాన్ చేశాడు. ప్లాన్ లో భాగంగా  ఆమెను కారులో తీసుకువెళ్లి స్పీడుగా చందనహళ్లి సరస్సులోకి వెళ్లాడు. కారు డోరు నుంచి బయటకు వచ్చిన రవి ఈదుకుంటూ సరస్సు బయటకు చేరుకున్నాడు. పాపం ఈత రాని శ్వేత ఊపిరాడక చనిపోయింది. కారు ప్రమాదవశాత్తూ సరస్సులో పడిపోయిందని, తాను ఈదుకుంటూ సురక్షితంగా బయటపడ్డానని రవి పోలీసులకు చెప్పాడు. అనుమానం వచ్చిన పోలీసులు రవిని తమదైన శైలిలో విచారించగా.. తానే ఆమెను చంపేందుకు ప్లాన్ చేశాననని ఒప్పుకున్నాడు. శ్వేత కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా పోలీసులు హత్య కేసు నమోదు చేసి రవిని అదుపులోకి తీసుకున్నారు.  పోలీసులు సహాయక చర్యలు  చేపట్టి కారును, ఆమె మృతదేహాన్ని బయటకు తీశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

కన్న కొడకే కాలయముడై 

తాండూరు గ్రామంలో చాకలి జమున అనే మహిళను ఆమె కొడుకు రాజు దారుణంగా హత్య చేశాడు. అది కూడా ఆస్తి కోసమే తన కన్నతల్లిని చంపిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆమె పేరున ఉన్న ప్రమాద బీమా సొమ్ము కోసమే రాజు ఈ ఘాతుకానికి ఒడిగట్టాడని పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..తాండూరు గ్రామానికి చెందిన చాకలి జమున (46) అనే మహిళ ఈ ఏడాది జనవరి 9న అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.  ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో పోలీసులు ఆమె ప్రమాదవశాత్తు ఇంట్లో కిందపడి మరణించినట్లు కేసు నమోదు చేశారు. అయితే ఆరు నెలల తర్వాత ఆమె కొడుకు చాకలి రాజు (28) ఒక హత్యాయత్నం కేసులో పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ క్రమంలో అతన్ని విచారించిన పోలీసులకు తన తల్లి మరణానికి సంబంధించిన అసలు విషయం వెలుగు చూసింది.

 గత జూలై నెలలో మండలంలోని ఆత్మాకూర్ గ్రామ గేటు సమీపంలో అక్రమ సంబంధంతో భర్తను చంపేందుకు భార్య కుట్ర పన్నిన కేసు వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఐదుగురిని అరెస్ట్‌ చేశారు. ఈ కేసులో అరెస్ట్‌ అయి రిమాండ్ లో ఉన్న జాన్సన్, సంపూర్ణ, చాకలి రాజు, నవీన్ అనే వ్యక్తులను సీన్ రీ కన్స్ట్రక్షన్ చేసే క్రమంలో చాకలి రాజు తల్లిని చంపిన సంఘటన వెలుగు చూసిందని ఎస్సై భార్గవ్ గౌడ్ తెలిపారు. 

Advertisment
తాజా కథనాలు