Sand Bazars: ఇల్లు కట్టుకునే వారికి శుభవార్త...ఇక నుంచి జిల్లాల్లోనూ శాండ్ బజార్లు..!
ఇక నుంచి బ్లాక్ మార్కెట్లో ఇసుక కొనాల్సిన పని లేదు. తక్కువ ధరకే ప్రభుత్వమే ఇసుకను సరఫరా చేయనుంది. దీనికోసం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో శాండ్ బజార్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. నాణ్యమైన ఇసుకను అందించడమే లక్ష్యంగా వీటిని తీసుకురానుంది.