GHMC Breakfast: మిల్లెట్ ఇడ్లీ, పూరీ, ఉప్మా, పొంగల్.. జీహెచ్ఎంసీ రూ.5 బ్రేక్ ఫాస్ట్ మెనూ ఇదే!
గ్రేటర్ హైదరాబాద్లో పేదల ఆకలి తీరుస్తున్న అన్న పూర్ణ ఐదురూపాయల భోజన కేంద్రాల్లో ఇక నుంచి ఉదయం అల్పాహారం, మిల్లెట్ టిఫిన్స్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాకుండా అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు ఇందిరా క్యాంటీన్లుగా మార్చనున్నారు.