/rtv/media/media_files/2025/08/20/chirutha-heroine-ram-charan-2025-08-20-15-24-31.jpg)
chirutha heroine ram charan
'చిరుత'(Chirutha) సినిమాలో రామ్ చరణ్(Ram Charan) హీరోయిన్ గా నటించిన నేహా శర్మ(neha-sharma) అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాలో తన గ్లామర్, స్క్రీన్ ప్రజెన్స్ తో కుర్రకారును ఫిదా చేసింది ఈ బ్యూటీ. తొలి సినిమాతోనే అప్పట్లో భారీ పాపులారిటీ దక్కించుకుంది. ఆ తర్వాత టాలీవుడ్, బాలీవుడ్ లో పలు సినిమాలతో అలరించిన నేహా.. మధ్యలో కొంతకాలం సైలెంట్ అయిపోయింది. చివరిగా 2018లో తమిళ చిత్రం 'సోలో ' లో మెరిసింది. దాదాపు రెండేళ్ల గ్యాప్ తరువాత.. మళ్ళీ 2020లో పంజాబీ సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి నేహా పలు సినిమాల్లో నటించినప్పటికీ.. క్యామియోలు, చిన్న రోల్స్ కి మాత్రమే పరిమితమైంది.
డైరెక్టర్ గా ఎంట్రీ
అయితే ఇంతకాలం నటిగా అలరించిన నేహా.. ఇప్పుడు డైరెక్టర్ ఎంట్రీ ఇవ్వబోతోందనే వార్త ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ నిర్మాణంలో రాబోతున్న ఓ పీరియాడిక్ యాక్షన్ డ్రామాతో నేహా దర్శకురాలిగా పరిచయమవుతున్నట్లు తెలుస్తోంది. చారిత్రక సంఘటనల ఆధారంగా 1945 బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా కథ సాగుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో నటుడు సిద్ధాంత్ చతుర్వేది, మోహిత్ కీలక పాత్రల్లో నటించనున్నట్లు సినీ వర్గాల్లో టాక్. అంతేకాదు ఈ సినిమా మ్యూజిక్, టెక్నాలజీ చాలా ఆకర్షణీయంగా ఉండబోతున్నాయని, అంతర్జాతీయ స్థాయిలో దీనిని తెరకెక్కించనున్నారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతానికి మాత్రం ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి మేకర్స్ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఏదేమైనా .. ఇప్పటివరకు నటిగా అలరించిన నేహా.. ఇప్పుడు దర్శకురాలిగా అరంగేట్రం చేయడం సినీ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. ఈ చిత్రంతో నేహా దర్శకురాలిగా కూడా మంచి సంపాదిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు.
Also Read: Venu Swamy: వేణుస్వామిని గుడి నుంచి తరిమేసిన అర్చకులు.. కామాఖ్యా ఆలయంలో షాకింగ్ ఘటన!