RTC JOBS: ఆర్టీసీలో 3035 ఉద్యోగాలపై సజ్జనార్ కీలక ప్రకటన!
ఆర్టీసీలో 3035 ఉద్యోగాలకు సంబంధించి వైరల్ అవుతున్న లింక్స్ అన్నీ ఫేక్ అని ఎండీ సజ్జనార్ తెలిపారు. ఆ లింక్‌లను ఉద్యోగార్థులు నమ్మొద్దు. క్లిక్ చేసి వ్యక్తిగత వివరాలను నమోదు చెయొద్దన్నారు. త్వరలోనే అధికారిక లింక్ విడుదల చేస్తామన్నారు.