AP Cabinet : ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..మావోయిస్టుల కోసం ప్రత్యేక కోర్టు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం అమరావతి సచివాలయంలో నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ తో పాటు వివిధ శాఖల మంత్రులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో 33 అజెండా అంశాలకు ఆమోదం లభించింది.

New Update
Ap cabinet

AP Cabinet meeting

 AP Cabinet : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం అమరావతి సచివాలయంలో నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ తో పాటు వివిధ శాఖల మంత్రులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో 33 అజెండా అంశాలకు ఆమోదం లభించింది. 51వ సీఆర్‌డీఏ సమావేశం ప్రతిపాదించిన అంశాలకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో రూ.904 కోట్లతో మౌలిక వసతుల కల్పనకు పచ్చజెండా ఊపింది. మావోయిస్టుల కేసుల విచారణ కోసం శ్రీకాకుళంలో ప్రత్యేక కోర్టు ఏర్పాటుకు ఆమోద ముద్ర పడింది. ఏపీ సర్క్యులర్‌ ఎకానమీ, వేస్ట్‌ రీస్లైకింగ్‌ పాలసీ (4.0) 2025-30కి ఆమోదం తెలిపింది. పర్యాటక ప్రాజెక్టులకు.. ప్రభుత్వ భూముల కేటాయింపు మార్గదర్శకాలకు ఆమోదం లభించింది. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాల కోసం..మార్పు చేసే నాలా చట్ట రద్దుకు ఆమోద ముద్ర వేసింది.

Also Read: ఆస్తికోసం అన్నతో బెడ్ షేర్ చేసుకున్న చెల్లి.. ప్రెగ్నెంట్ కావడంతో కోర్టు మెట్లెక్కిన పంచాయితీ!

గ్రామ, వార్డు సచివాలయాల్లో అవసరమైన సిబ్బంది కోసం డిప్యూటేషన్‌, ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన 2,778 పోస్టుల భర్తీ చేయడానికి మంత్రి వర్గం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అధికారిక భాష కమిషన్‌ పేరును ‘మండలి వెంకట కృష్ణారావు అధికారిక భాష కమిషన్‌’గా మార్పునకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మద్యం ధరల నిర్ణయించే టెండర్ కమిటీకి ఆమోదం తెలిపింది. తోట వెంకటాచలం (కాకినాడ) లిఫ్ట్‌ ఇరిగేషన్ కాలువ అభివృద్ధి పనులకు, పంచాయతీరాజ్‌ చట్టంలోని పలు సెక్షన్ల చట్ట సవరణకు, కడప మైలవరంలో 250 మెగా వాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటుకు ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకుంది. ఆదానీ సోలార్ ఎనర్జీ సంస్థకు 200.05 ఎకరాలు కేటాయించడానికి కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. గుంటూరు టీడీపీ కార్యాలయ భూమి లీజు కాలపరిమితి పెంపునకు ఆమోదించింది.

ఇది కూడా చదవండి:తెలంగాణ రైతులకు శుభవార్త.. కొత్త పాస్‌బుక్ వచ్చిన వారందరికీ ఈ నెలలో రైతు బీమా

సాకేత్‌కు డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం

టెన్నిస్ లో ప్రతిభ కనపరుస్తున్న ప్లేయర్ సాకేత్‌కు  డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. వీటితో పాటు చిత్తూరు సీహెచ్‌సీని 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి, 56 కొత్త పోస్టుల మంజూరు చేయాలన్న ప్రతిపాదనలకు ఓకే చెప్పింది. నాలా పన్ను 4 శాతంలో 70 శాతం స్థానిక సంస్థలకు, 30 శాతం అథారిటీలకు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.ఏపీ యాచక నిరోధక చట్టసవరణ ముసాయిదా బిల్లును కూడా ఆమోదించింది. 

Also Read: Neha Sharma: డైరెక్టర్ గా మారిన రామ్ చరణ్ ఫస్ట్ హీరోయిన్.. ఏకంగా స్టార్ హీరోతోనే సినిమా!

Advertisment
తాజా కథనాలు