Godavari Water: హైదరాబాద్‌కు గోదావరి వాటర్‌ బంద్‌

హైదరాబాద్‌ నగరానికి గోదావరి వాటర్‌ బంద్‌ కానున్నాయి. అయితే అవి పూర్తిగా కాదు. ఈ నెల 9,10 తేదీల్లో నగరానికి గోదావరి జలాలు రావు. 48 గంటలు అంటే రెండు రోజుల పాటు నగరంలోని పలు ప్రాంతాలకు  నీటి సరఫరాలో అంతరాయం కలగనుంది.

New Update
Godavari water

Godavari water

హైదరాబాద్‌ నగరానికి గోదావరి వాటర్‌ బంద్‌(Godavari Water Bandh) కానున్నాయి. అయితే అవి పూర్తిగా కాదు. ఈ నెల 9,10 తేదీల్లో నగరానికి గోదావరి జలాలు రావు. 48 గంటలు అంటే రెండు రోజుల పాటు నగరంలోని పలు ప్రాంతాలకు  నీటి సరఫరాలో అంతరాయం కలగనుంది. గోదావరి డ్రింకింగ్‌ వాటర్‌ సప్లయ్‌ పేజ్‌-1 పథకంలో భాగంగా ముర్మూర్‌, మల్లారం, కొండపాక పంపింగ్‌ స్టేషన్లలో 3000 మి.మీ డయా ఎంఎస్‌ పంపింగ్‌ మెయిన్‌పై అమర్చిన 900 మిమీ డయా వాల్వుల మార్పిడి పనులు చేయనున్న నేపథ్యంలో నీటి సరఫరా ను నిలిపివేయనున్నారు. ఈ నెల 9న ఉదయం 6 నుంచి బుధవారం ఉదయం 11 గంటల వరకు మార్పిడి పనులు నిర్వహించనున్నారు. దీంతో నీటి సరఫరాలో అంతరాయం కలగనున్నట్లు తెలిపారు.

ఇది కూడా చూడండి:Balapur Ganesh Laddu: కోటి ఖర్చైనా పర్లేదు..బాలాపూర్ లడ్డూకు ఈ సారి భారీ పోటీ!

Godavari Water Bandh

గోదావరి జలాలకు అంతరాయ కలిగే ప్రాంతాలివే : ఎస్‌పీఆర్‌ హిల్స్‌, ఎర్రగడ్డ, బంజారాహిల్స్‌, ఎస్‌ఆర్‌ నగర్‌, సనత్‌నగర్‌, బోరబండ,  సోమాజిగూడ, ఫతేనగర్‌ సెక్షన్లు,వెంకట్రావు నగర్‌, ఎల్లారెడ్డిగూడ, సోమాజిగూడ, ఫతేనగర్‌ సెక్షన్లు, తాటిఖానా కొంత భాగం, కూకట్‌పల్లి, భాగ్యనగర్‌, వివేకానంద నగర్‌, జూబ్లీహిల్స్‌లో కొంత భాగం, ఎల్లమ్మబండ. భరత్‌నగర్‌, మోతీనగర్‌, గాయత్రీనగర్‌, బాబానగర్‌, కేపీహెచ్‌బీ, బాలాజీనగర్‌, మూసాపేట్‌,  హష్మత్‌పేట్‌ సెక్షన్‌, చింతల్‌, సుచిత్ర, జీడిమెట్ల,గాజులరామారం, సూరారం. ఆదర్శనగర్‌, భగత్‌సింగ్‌నగర్‌, షాపూర్‌నగర్‌,  జగద్గిరిగుట్ట, ఉషోదయ సెక్షన్‌. అల్వాల్‌, ఫాదర్‌ బాలయ్యనగర్‌, వెంకటాపురం, మాచ్చబోలారం, డిఫెన్స్‌ కాలనీ, వాజ్‌పేయి నగర్‌, యాప్రాల్‌, చాణక్యపురి,   లాలాపేట్‌ కొంత భాగం, తార్నాకా కొంత భాగం, కాప్రా మున్సిపాలిటీ పరిధిలోని చర్లపల్లి,సాయినాథ్‌పురం సెక్షన్‌, మౌలాలి రిజర్వాయర్‌, రాధికా సెక్షన్లు, కైలాసగిరి పాత, సాయిబాబానగర్‌,గౌతమ్‌నగర్‌. మాదాపూర్‌ కొంత భాగం, గచ్చిబౌలి కొంత భాగం,   కొత్త రిజర్వాయర్‌ ప్రాంతాలు..  కొండాపూర్‌, డోయెన్స్‌,  నల్లగండ్ల కొంత భాగం, హఫీజ్‌పేట్‌.హౌసింగ్‌ బోర్డు సెక్షన్‌, మల్లాపూర్‌ కొంత భాగం,  మియాపూర్‌ సెక్షన్లు తదితర ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిచిపోనుంది.

ఇది కూడా చదవండి:గణేశుడి నిమజ్జనానికి 5 శుభ ముహూర్తాలు ఇవే!

వీటితో పాటు  పొచారం, కొంపల్లి, గుండ్లపోచంపల్లి, తూముకుంట, నాగారం సెక్షన్‌, అయ్యప్పకాలనీ రిజర్వాయర్‌ ప్రాంతాలు, నిజాంపేట్‌, బాచుపల్లి, ప్రగతినగర్‌, జవహర్‌నగర్‌, దమ్మాయిగూడ,  గండిమైసమ్మ, తెల్లాపూర్‌, మెఈఎస్‌, త్రిశూల్‌ లైన్స్‌, గన్‌రాక్‌, హకీంపేట్‌ ఎయిర్‌ఫోర్స్‌, బోల్లారం, బౌరాంపేట్‌ సెక్షన్లు..  సికింద్రాబాద్‌ కాంటోన్మెంట్‌, ఏఐఐఎంఎస్‌బీ నగర్‌, ప్రాంతాలున్నాయి. వీటితో పాటు గ్రామీణ నీటి సరఫరా (ఆర్‌డబ్ల్యూఎస్‌) ఆఫ్‌టేక్స్‌ పరిధిలోని ఆలేర్‌ (యాదాద్రిభువనగిరి), ఘన్‌పూర్‌ (మేడ్చల్‌/శామీర్‌పేట్‌) ప్రాంతాల్లో నీటి సరఫరా అంతరాయం తలెత్తనుందని, ఆయా ప్రాంతాల వినియోగదారులు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలి’’ అని వాటర్‌బోర్డు అధికారులు సూచించారు.

ఇది కూడా చూడండి:TG Dasara Holidays: తెలంగాణ స్టూడెంట్స్ కు అదిరిపోయే శుభవార్త.. దసరా సెలవులు ప్రకటించిన సర్కార్.. లిస్ట్ ఇదే

Advertisment
తాజా కథనాలు