/rtv/media/media_files/2025/06/21/srinagar-sizzles-record-heat-prompts-school-timing-changes-and-school-holidays-2025-06-21-10-38-35.jpg)
TG Dasara Holidays: తెలంగాణ ప్రజలు అత్యంత వైభవంగా, ప్రతిష్టాత్మకంగా జరుపుకునే పండగల్లో బతుకమ్మ, దసరా ఒకటి. ఇక ఈ పండగలు వస్తున్నాయంటే విద్యార్థులకు కూడా పండగే! స్కూళ్లకు, కాలేజీలకు బోలెడు సెలవులు వస్తాయి. దీంతో దసరా సెలవులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తూ ఉంటారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త చే చెప్పింది. విద్యాసంస్థలకు దసరా సెలవులను ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. బతుకమ్మ, దసరాకు కలిపి మొత్తం 13 రోజుల పాటు సెలవులు ప్రకటించింది. సెప్టెంబర్ 21 నుంచి అర్టోబర్ 3 వరకు స్కూలకు దసరా సెలవులు ఉండనున్నట్లు తెలిపింది. దసరాకు 15 రోజుల ముందు నుంచే రాష్ట్రమంతటా బతుకమ్మ సంబరాలు మొదలవుతాయి! ఈ మేరకు ప్రతి ఏడాది 13- 15 రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటిస్తుంది ప్రభుత్వం.
తిరిగి 14న ప్రారంభం..
ఇక సెలవుల తర్వాత తిరిగి అక్టోబర్ 4న స్కూల్స్ ప్రారంభం కానున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. ఏదైనా మార్పులు ఉంటే ముందుగానే తెలియజేస్తామని అధికారులు తెలిపారు. అయితే ఈ సారి దసరా సెలవుల్లో కొన్ని ప్రభుత్వ సెలవు దినాలు కూడా కలిసిపోయాయి. అక్టోబర్ 2న గాంధీ జయంతి హాలిడే దసరా సెలవుల్లోనే కలిసిపోతుంది. ప్రభుత్వ సెలవులతో తెలంగాణాలో దసరా, బతుకమ్మ వేడుకలు మరింత జోరుగా సాగనున్నాయి. లాంగ్ హాలీడేస్ కావడంతో నగరాల్లో నివసించే ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కుటుంబాలతో కలిసి సొంతూళ్ల బాట పడతారు. వరుసగా 13 రోజులు సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు సంతోషానికి అవధుల్లేవు!
మరోవైపు ఏపీ ప్రభుత్వం కూడా విద్యాసంస్థలకు దసరా సెలవులను ప్రకటించింది. సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా సెలవులు ప్రకటించారు. తెలంగాణలో మొత్తం 13 రోజులు సెలవులు ఉండగా.. ఏపీలో 10 రోజులు మాత్రమే సెలవులు ఇవ్వనున్నారు. ఇక ఆంద్రప్రదేశ్ లోని క్రిస్టియన్ , మైనారిటీ స్కూల్స్ విషయానికి వస్తే.. వీటికి వేర్వేరు తేదీల్లో సెలవులు ప్రకటించారు. సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 2 వరకు సెలవులు ఉండనున్నాయి.
Also Read: Telangana: తాగుబోతు టీచర్.. క్లాస్ రూంలో పిల్లల ముందే ఏం చేశాడో తెలుసా?.. షాకింగ్ వీడియో
ఇదిలా ఉంటే.. ఈ వారం కూడా వరుస మూడు రోజులు విద్యాసంస్థలకు, ఆఫీసులకు సెలవులు ఉన్నాయి. సెప్టెంబర్ 5న ముస్లిమ్స్ పండగ మిలాద్ ఉన్ నబీ సందర్భంగా స్కూళ్లకు, ప్రభుత్వ ఆఫీసులకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం. ఆ తర్వాత సెప్టెంబర్ 6న ఖైరతాబాద్ వినాయక నిమ్మజ్జనం సందర్భంగా స్కూళ్లకు, కాలేజీలకు, ఆఫీసులకు సెలవు ప్రకటించారు. ఖైరతాబాద్ గణపయ్య శోభాయాత్రతో హైదరాబాద్ వీధులు జనంతో కిక్కిరిసిపోతాయి. ఎక్కడెక్కడి నుంచి వినాయకుడి నిమ్మజనం చూసేందుకు ప్రజలు తరలి వస్తారు. దీంతో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి ఆఫీసులకు స్కూళ్లకు సెలవు ప్రకటించారు అధికారులు. ఇక సెప్టెంబర్ 7 న ఆదివారం కావడంతో మళ్ళీ సెలవు. ఇలా సెప్టెంబర్ అంతా 15కి పైగా సెలవు దినాలతో విద్యార్థులకు పండగే!
Also Read: Bathukamma: అంబరాన్నంటేలా బతుకమ్మ సంబరాలు.. ఈ సారి స్పెషల్ ఏంటో తెలుసా!?