హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. రేపు ఈ ప్రాంతాల్లో నీళ్లు బంద్
హైదరాబాద్లో అశోక్ నగర్, మదీనాగూడ, మియాపూర్, అమీన్పూర్, ఎర్రగడ్డ, ఎస్ఆర్ నగర్, అమీర్పేట, కేపీహెచ్బీ కాలనీ, కూకట్పల్లి, మూసాపేట ప్రాంతాల్లో రేపు నీటి సరఫరాకు అంతరాయం కలగనుందని అధికారులు తెలిపారు. మరమ్మత్తుల దృష్ట్యా 24 గంటల పాటు నీరు సరఫరా ఉండదు.