కోనోకార్పస్ మొక్కల తొలగింపు.. GHMC కీలక ఆదేశాలు!

కోనో కార్పస్‌ మొక్కలపై ప్రజల్లో భయాందోళనలు నెలకొన్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మొక్కలను కొత్తగా నాటకూడదని, ఉన్న వాటిని నరకవద్దని ఆదేశించింది. ఆస్తమా వస్తుందనే అపోహలను నమ్మవద్దని, చెట్లు నరికితే చర్యలు తప్పవని జీహెచ్‌ఎంసీ హెచ్చరిస్తోంది.

New Update
conocorpus

conocorpus

ప్రస్తుతం వివాదాస్పదాశంగా మారిన కోనో కార్పస్‌ మొక్కలపై ప్రజల్లో నెలకొన్న భయాందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా కోనో కార్పస్‌ మొక్కలను నాటవద్దని, అలాగే ఇప్పటికే నగరాలు, పట్టణాల్లో విస్తరించి ఉన్న ఈ మొక్కలను నరకడానికి కూడా వీలు లేదని  కేంద్రం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయాన్ని జీహెచ్‌ఎంసీ అర్బన్ బయోడైవర్సిటీ  అడిషనల్ కమిషనర్ సుభద్ర బుధవారం  మీడియాకు తెలిపారు.

Also Read: Uttara Pradesh: కలిసే ఉంటానని..విడిచిపెట్టానని ప్రమాణం చేశా..అందుకే కలిసే..!

కోనో కార్పస్‌ చెట్లపై ప్రజల్లో ఉన్న అపోహలను నమ్మవద్దని సుభద్ర అన్నారు. ఈ చెట్ల వల్ల ఆస్తమా వస్తుందనే ప్రచారంలో వాస్తవం లేదని ఆమె కొట్టిపారేశారు. ఒకవేళ ఎవరైనా కోనో కార్పస్‌ చెట్లను నరికితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. నగరంలో ఏ చెట్టును తొలగించాలన్నా సంబంధిత జీహెచ్‌ఎంసీ అధికారుల నుండి తప్పనిసరిగా NOC  తీసుకోవాలని ఆమె సూచించారు. అలా కాకుండా ఎవరైనా ఇష్టానుసారంగా చెట్లను తొలగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కోనో కార్పస్‌ చెట్ల వల్ల ఎక్కడైనా ప్రజలకు ఏదైనా ఇబ్బంది తలెత్తితే నేరుగా జీహెచ్‌ఎంసీ అధికారులకు సమాచారం ఇవ్వాలని, తక్షణమే చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు.

Also Read: Jammu Kashmir-Supreme Court: ఓసారి కలిసి కూర్చుని మాట్లాడుకోండి.. సీఎం విడాకుల కేసుపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

GHMC - Conocarpus Trees

మరోవైపు, కోనో కార్పస్‌ చెట్లపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది ఈ మొక్కలు పర్యావరణానికి మేలు చేస్తాయని సమర్థిస్తుంటే, మరికొందరు మాత్రం వీటి వల్ల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ మొక్కల పుప్పొడి వల్ల ఆస్తమా వస్తుందనే ప్రచారం బాగా జరుగుతోంది.

ఈ నేపథ్యంలో, సీసీఎంబీ మాజీ డైరెక్టర్ మోహన్‌రావు ఈ విషయంపై స్పందించారు. కోనో కార్పస్‌తో ఆస్తమా వచ్చే అవకాశం కొంతవరకు ఉన్నప్పటికీ, ఇది కేవలం ఈ మొక్కలకే పరిమితం కాదని, అన్ని రకాల పూలు పూసే మొక్కల వల్ల కూడా ఇలాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆయన అన్నారు. అంతేకాకుండా, కోనో కార్పస్‌ మొక్కలతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని ఆయన తెలిపారు. 

కొన్ని అధ్యయనాల ప్రకారం, కోనో కార్పస్‌ ఆకులను మేకలకు ఆహారంగా ఇవ్వడం వల్ల పాల ఉత్పత్తి దాదాపు 20 శాతం వరకు పెరిగినట్లు తేలిందని ఆయన వెల్లడించారు. ఈ మొక్కలు కరువు పరిస్థితులను తట్టుకుని, తక్కువ నీటితో కూడా జీవించగలవని ఆయన పేర్కొన్నారు.

Also Read: Artificial intelligence: చైనాలో అకస్మాత్తుగా మరణిస్తున్న ఏఐ శాస్త్రవేత్తలు.. ఏంటీ ఆ మిస్టరీ ?

Also Read: Time Most Influential Persons: టైమ్స్ ప్రభావశీలుర జాబితాలో ట్రంప్,యూనస్‌...భారతీయులకు దక్కని ప్లేస్‌!

telangana | ghmc | conocarpus | trees | hyderabad | latest-telugu-news | latest telugu news updates | telugu-news | latest-news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు