/rtv/media/media_files/2025/04/17/bjbhPZNFJOsMqKJQAcEE.jpg)
Artificial intelligence
ప్రస్తుతం అమెరికా, చైనా మధ్య వాణిజ్యం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) రంగంలో పోటీ నెలకొంది. ఇలాంటి నేపథ్యంలో చైనాకు చెందిన ఏఐ శాస్త్రవేత్తలు ఆకస్మికంగా మృతి చెందడం కలకలం రేపుతోంది. 2022 నుంచి 2025 మధ్య మూడేళ్లలో చాలామంది ఏఐ నిపుణులు ప్రమాదాలు, అనారోగ్య కారణాల వల్ల మృతి చెందారు. వీళ్లలో ఎక్కువగా అమెరికాలో చదువుకొని, అక్కడ పనిచేసి చైనాకు తిరిగొచ్చిన వాళ్లు కావడం గమనార్హం.
Also Read: కాబోయే అల్లుడితో అత్త జంప్ వ్యవహారంలో బిగ్ ట్విస్ట్.. అంతా అత్తే చేసిందన్న అల్లుడు
AI Scientists Deaths
చైనాకు చెందిన ఏఐ శాస్త్రవేత్తలు చిన్న వయస్సులో ఇలా అకస్మాత్తుగా మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల భారత సంతతికీ చెందిన ఏఐ నిపుణుడు సుచీర్ బాలాజీ కూడా అనుమానస్పదంగానే మృతి చెందారు. అమెరికాలో 35 పేటెంట్లు పొందిన మైక్రోసాఫ్ట్ మాజీ పరిశోధకుడు సన్ జియాన్ 45 ఏళ్ల వయసులో 2022లో మృతిచెందారు. అమెరికా నుంచి చైనాకు వచ్చిన తర్వాత బీజింగ్‌లోని మెగ్వీ టెక్నాలజీలో ఆయన చీఫ్ సైంటిస్ట్‌గా పనిచేసేవారు.
ఇక చైనా డిఫెన్స్ రంగంలో ఏఐ నిపుణిడిగా పనిచేసిన ఫెంగ్ యాంగే (38) జులై 2023లో మరణించారు. అలాగే చైనీస్ యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్‌లో ప్రొఫెసర్, సెన్స్‌టైమ్ వ్యవస్థాపకుడు టాంగ్ జియావో (55) కూడా ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. కానీ ఆయన ఎలా మరణించాడన్న దానిపై క్లారిటీ లేదు. ఇదిలాఉండగా ఏఐ ఆధారిత హెల్త్‌కేర్ సంస్థలో పనిచేసిన హే జీ (41) 2024లో గుండెపోటుతో మరణించారు. సౌత్ చైనా యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీలో పనిచేసే క్వాన్ యుహున్ (39) ఈ ఏడాది జనవరిలో మృతి చెందారు. అయితే చైనా ఏఐ నిపుణులకు సంపాదన ఎక్కువ ఉన్నప్పటికీ ఒత్తిడీ కూడా చాలా ఎక్కువగా ఉంటుందని పలువురు నిపుణులు చెబుతున్నారు.
Also Read: ఓసారి కలిసి కూర్చుని మాట్లాడుకోండి.. సీఎం విడాకుల కేసుపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!
చైనా ఏఐ నిపుణుడు లియూ షావోషన్ దీని గురించి మాట్లాడారు. '' ఒక ఆలోచనతో స్వదేశానికి వచ్చి పరిశోధనలు చేసేసరికి, మరో వ్యక్తి అలాంటి దానిపైనే ప్రాజెక్టు పూర్తి చేస్తే ఒత్తిడి మరింత తీవ్రమవుతుంది. మనం ఏదైనా కొత్త ఆలోచనతో చేయాలని అనుకున్నప్పుడు ఎవరైనా దాన్ని ముందుగానే పూర్తి చేస్తే నిరాశ కలుగుతుంది. సమాజంలో ఎదురుపడే మార్పులు కూడా నైతికంగా ఆందోళనకు కారణమవుతాయని'' షావోషన్ అన్నారు.
Also Read : వేసవికాలంలో మూత్ర పిండాలను రక్షించుకుందాం!
Also Read : Kerela state Awardsలో సత్తా చాటిన 'The Goat Life' ఏకంగా తొమ్మిది కేటగిరీల్లో.. ఉత్తమ నటుడిగా పృథ్వీరాజ్
artificial-intelligence | telugu-news | rtv-news | national-news