/rtv/media/media_files/2025/03/29/1JulEyWQ6TuRZqiTKh3M.jpg)
gun fire
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఓ దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. కేన్సర్ బాధితుడు తన భార్యను తుపాకీతో కాల్చి చంపి అనంతరం తనని తాను కాల్చుకుని ఆత్మహత్య కి పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ముందు లెటర్ రాసి పెట్టి ప్రాణాలు తీసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
Also Read: Telangana: తెలంగాణ లో భిన్న వాతావరణం.. ఆ జిల్లాల్లో వర్షాలు.. ఈ జిల్లాల్లో ఎండలు.. !
Uttar Pradesh Crime
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మీరట్ నివాసి అయిన కుల్దీప్ త్యాగి.. భార్య నిషు త్యాగిని తుపాకీతో కాల్చి చంపి అనంతరం తనని తాను కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నట్లు చెబుతున్నారు. బుధవారం ఘజియాబాద్‌లో ఈ దారుణ సంఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే దంపతులు చనిపోయిన దగ్గర సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
బాధితుడు సూసైడ్ నోట్‌లో తనకు క్యాన్సర్ ఉందని.. చికిత్స ఖర్చులు కుటుంబానికి భారంగా ఉండకూడదని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నట్లు తెలిపారు. తన భార్యతో జీవితాంతం కలిసి ఉంటానని మాట ఇచ్చానని.. అందుకే ఆమెను చంపి తాను ఆత్మహత్య చేసుకున్నట్లు అందులో పేర్కొన్నాడు. తనకు క్యాన్సర్ ఉందని కుటుంబ సభ్యులకు తెలియదని అందులో పేర్కొన్నారు కుల్దీప్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు. అయితే క్యాన్సర్ రోగం మానసికంగా అతనిని బాగా కుంగదీసినట్లు తెలుస్తుంది.
ఇక సంఘటన జరిగిన సమయంలో కుల్దీప్ తండ్రి, ఇద్దరు పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారు. సూసైడ్ నోట్‌ను బట్టి హత్యా, ఆత్మహత్య అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ మిశ్రా పేర్కొన్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం తరలించామని, దర్యాప్తు కొనసాగుతుందని వెల్లడించారు.
Uttar Pradesh | crime | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates | suicide