/rtv/media/media_files/2025/05/28/cNoCOljiT3872hbqjisS.jpg)
Gang selling babies
TG Crime : పసిపిల్లలను అమ్ముతున్న ఓ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. సూర్యపేట జిల్లా లో శిశువులను విక్రయిస్తు్న్నారనే సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించి నిందితులను పట్టుకున్నారు. నిందితులలో ఆరుగురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు. వీరు తాజాగా 16 నెలల మగ శిశువును విక్రయిస్తుండగా అధికారులు దాడి చేసి అరెస్ట్ చేశారు. శిశువును చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు అప్పగించారు.
ALSO READ: స్టూడెంట్స్ షాక్ ల మీద షాక్ లు ఇస్తున్న ట్రంప్..వీసా ఇంటర్వ్యూలు నిలిపేయాలని ఆదేశం
కాగా ఈ ముఠా రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్, గుజరాత్ నుంచి శిశువులను కొని తీసుకువస్తోంది. అక్కడ తక్కువ ధరకు కొనుక్కు వచ్చిన పిల్లలలను ఇక్కడ ఒక్కో శిశువును రూ.3 లక్షల నుంచి రూ.7 లక్షలకు అమ్ముతోంది. ఈ ముఠా ఇప్పటివరకు 22 మందిని విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. కాగా ఈ ముఠా నుంచి పిల్లలను కొనుగోలు చేసిన కుటుంబాలను గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ALSO READ: ఈసారి ఆర్సీబీ కప్ గెలుస్తుందా? చాట్‌జీపీటీ ఆన్సర్‌కు ఫ్యాన్స్ అవాక్!