TG Accident: సూర్యాపేట హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్
ఖమ్మం జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది.