/rtv/media/media_files/2025/05/28/fWviQylMxVq9xKRif0I7.jpg)
rcb will win ipl 2025 chatgpt, meta ai, grok prediction
ఐపీఎల్ 2025లో ఆర్సీబీ జట్టు దుమ్ము దులిపేస్తోంది. ఈ సారి టైటిల్ కొట్టాలనే దృఢ సంకల్పంతో తీవ్రంగా కష్టపడుతోంది. నిన్న లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విధ్వంసకర బ్యాటింగ్ చేసింది. 228 టార్గెట్‌ను అలవోకగా ఛేదించింది. మరో 1.2 ఓవర్లు మిగిలి ఉండగానే టార్గెట్‌ను ఛేదించింది. దీని ఫలితంగా పాయింట్ల పట్టికలో టాప్ 2కి చేరుకుంది.
Also Read: అనిరుధ్‌కు కాస్ట్‌లీ గిఫ్ట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
దీంతో ఆర్సీబీ ఈ సారి కప్పు గెలుస్తుందని అభిమానులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. మరోవైపు ఐపీఎల్ 2025 ట్రోఫీని ఆర్సీబీ దక్కించుకుంటుందా?.. విరాట్​ కోహ్లీ చేతికి కప్​ అందుతుందా?.. 18ఏళ్ల నిరీక్షణకు ఈ సీజన్‌తో తెరపడుతుందా? ఫ్యాన్స్​ కాలర్​ ఎగరేసే రోజు అతి దగ్గరలోనే ఉందా? అనే పలు ప్రశ్నలపై చాట్​జీపీటీ, మెటా ఏఐ, గ్రాక్​ ఆసక్తికర విషయాలు పంచుకున్నాయి.
Also Read: మరో యువతితో లాలూ కొడుకు రాసలీలలు.. జీవితం నాశనం చేశారంటూ తేజ్ భార్య ఆరోపణలు!
చాట్​జీపీటీ
ఈ సీజన్ ఆర్సీబీ జర్నీ ఇంప్రెసివ్​గా ఉంది. ప్రధాన జట్లతో గెలవడం తేలికైనవిషయం కాదు. అందుకు కన్సిస్టెన్సీ, రెసీలియెన్స్​ వంటివి ప్రధాన కారణం. స్పిన్​ బౌలింగ్​లో ఆర్సీబీ వెనకపడింది. ఈ సీజన్ ట్రోఫీకి గట్టి పోటీ ఉంది. స్పిన్​, మిడిల్​ ఆర్డర్​ ప్రదర్శన నాకౌట్‌లో కీలకంగా మారనుంది. వీటిని చూసుకుంటే ఐపీఎల్​ చరిత్రలో తొలిసారి కప్​ కొట్టే అవకాశం ఆర్సీబీకి ఉంది అని తెలిపింది.
Also Read: వారెవ్వా అదిరిపోయింది.. iQOO నుంచి కిర్రాక్ స్మార్ట్‌ఫోన్ - ఫీచర్లు హైక్లాస్!
మెటా ఏఐ
కోహ్లీ టీమ్ 9 ఏళ్లల్లో మొదటి సారి టేబెల్ టాప్ 2లో చేరింది. దీనికి విరాట్ ఫామ్, బలమైన మిడిల్ ఆర్డర్, అద్భుతమైన బౌలింగ్ ప్రధాన కారణం. అయితే ఆర్సీబీ ట్రోఫీ గెలవడానికి కొన్ని సవాళ్లు ఉన్నాయి. ఈ సీజన్‌లో ఆర్సీబీ సక్సెస్ అవ్వాలంటే ఇప్పుడున్న ఫామ్‌నే కొనసాగించాలి. ప్లేయర్లలో ఒత్తిడి ఉండకూడదు. గాయలు అవ్వకుండా చూసుకోవాలి. ఇలా అయితే ఈ సారి ఆర్సీబీ కప్పు గెలిచే అవకాశాలు ఉన్నాయి అని తెలిపింది.
గ్రాక్​
ఈ సీజన్‌లో ఆర్సీబీ అద్భుత ప్రదర్శన చేసింది. విరాట్​ కోహ్లీ బాగా రాణిస్తున్నారు. టీమ్‌కి మంచి మూమెంటమ్​ ఉంది. గత సీజన్ కంటే ఈ సీజన్ చాలా కన్సిస్టెంట్‌గా ఉంది. ఓవైపు బ్యాటింగ్, మరోవైపు బౌలింగ్‌లో అదరగొడుతుంది. టాప్ టీమ్‌లతో పోటీపడి ఇంతవరకు రావడం అంత తేలికైన విషయం కాదు. ఆర్సీబీ ప్రధాన పోటీదారు అయినప్పటికీ ఖచ్చితంగా ట్రోఫీ గెలుస్తుందని చెప్పలేము. ఇంకాస్త గట్టిగా కష్టపడితే గెలవచ్చు అని తెలిపింది.