/rtv/media/media_files/2025/05/17/PgCs0nb1ZMHPNIdSZcQs.jpg)
అమెరికాలో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూఎస్ ఎంబసీల్లో స్టూడెంట్ వీసా ఇంటర్వ్యూలను నిలిపేయాలని ఆదేశించింది. నెక్స్ట్ గైడ్ లైన్స్ వచ్చే వరకు అడిషనల్ స్టూడెంట్ లేదా ఎక్చ్సేంచ్ విజిటర్ వీసా అపాయింట్ మెంట్స్ కాన్సిల్ చేయాలని చెప్పింది. తాత్కాలికంగా ఇంటర్వ్యూలను నిలిపేసింది. దాంతో పాటూ రూల్స్ ను మరింత కఠినతరం చేయనుందని తెలుస్తోంది. ఇందులో అన్నింటికంటే ముఖ్యం సోషల్ మీడియా నిఘా. విదేశీ విద్యార్థుల సోషల్ మీడియా ఖాతాలను తనిఖీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే యాక్సెప్ట్ చేసిన వీసాల వ్యక్తుల సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించనున్నారు. దాంతో పాటూ నెక్స్ట్ ఆదేశాలు జారీ చేసే వరకు ఎఫ్, ఎం, జె అదనంగా ఎటువంటి వీసా అపాయింట్‌మెంట్లను దౌత్య విభాగాలు అనుమతించవు. దీంతో అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు భారీ షాక్ తగలనుంది. భారత దేశం నుంచి అమెరికాకు వేలల్లో చదువుకోవడానికి వెళతారు. అమెరికాకు చదువుకోవడానికి వెళ్ళే వారిలో భారతీయులు రెండ స్థానంలో ఉన్నారు. ఇప్పుడు వీసాలనే ఇవ్వకపోతే వారి ఆశలన్నీ అడియాశలుగా మిగిలిపోనున్నాయి.
క్లాసులకు రాకపోతే అంతే సంగతులు..
దీనికన్నా ముందు నిన్న ఇంకో షాక్ కూడా ఇచ్చారు ట్రంప్. అమెరికాలో చదువుకుంటున్న అంతర్జాతీయ విద్యార్థులు పై ఉక్కుపాదం మోపారు. ఇప్పటికే విద్యా వీసా నిబంధనలు పాటించని వేల మంది ఫారిన్ విద్యార్థులు వీసాలను, చట్టబద్దమైన హోదాలను తొలగించారు. ఈ నేపథ్యంలో తాజాగా అమెరికాలోని భారత విద్యార్థులకు మరో షాకిచ్చింది ట్రంప్ ప్రభుత్వం. అమెరికాలో ఉన్న అంతర్జాతీయ విద్యార్థులు తమ విద్యా వీసా నిబంధనలను ఖచ్చితంగా పాటించకపోతే, వీసా రద్దయే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రతిరోజు క్లాసులకు రాకపోయినా, కోర్సును మధ్యలోనే వదిలేసినా, యూనివర్సిటీలకు ముందస్తు సమాచారం లేకుండా డ్రాపౌట్ అయినా వీసాలు రద్దు రద్దవడమే కాకుండా భవిష్యత్తులో US వీసా దరఖాస్తుకు కూడా అర్హత లేకుండా పోతుందని.. ఇండియాలోని అమెరికన్ ఎంబసీ విద్యార్థులకు హెచ్చరికలు జారీ చేసింది. చదువుకోవడానికి వెళ్లిన విద్యార్థులు వీసా నిబంధనల ప్రకారం స్టూడెంట్ స్టేటస్ కాపాడుకోవడం అత్యంత కీలకమని సూచించింది. వీసా నిబంధనలు పాటించకపోవడం వల్ల భవిష్యత్తులో ఉద్యోగ వీసాలు (H-1B), పిఆర్ (Green Card) లేదా ప్రయాణ వీసాలు పొందే అవకాశాలు కోల్పోతారని చెప్పింది.
today-latest-news-in-telugu | usa | america president donald trump | student | visa
Also Read: RCB VS LSG: పట్టికలో రెండో స్థానం..క్వాలిఫయర్ 1కు దూసుకెళ్ళిన ఆర్సీబీ