Road Accident: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు తెలంగాణ విద్యార్థినుల మృతి

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు తెలంగాణ విద్యార్థినులు మరణించారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వీరు  మృతి చెందారు. మృతులు ఇద్దరు మహబూబాబాద్ మండలం గార్ల గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు.

New Update
FotoJet (39)

California accident

Telangana: అమెరికా(america)లో ఘోర రోడ్డు ప్రమాదం(road accident) జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు తెలంగాణ విద్యార్థినులు మరణించారు. అమెరికాలోని కాలిఫోర్నియా(california) లో జరిగిన రోడ్డు ప్రమాదంలో వీరు  మృతి చెందారు. మృతులు ఇద్దరు మహబూబాబాద్(mahaboobabad) మండలం గార్ల గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. ఇద్దరు ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లారు.

పులఖండం మేఘనారాణి (25), కడియాల భావన (24) ఎమ్మెస్ పూర్తి చేసి ఉద్యోగ అన్వేషణలో ఉన్నారు. స్నేహితులతో కలిసి టూర్‌కు వెళ్లి వస్తుండగా.. వీరు ప్రయాణిస్తున్న కారు లోయలో పడింది. ఈ ఘటనలో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. కడియాల భావన, మేఘనలు ఈ ప్రమాదంలో అక్కడికక్కడే మరణించారని ఇక్కడి వారి బంధువులకు సమాచారం అందించారు. కాగా మృతుల్లో మేఘన తండ్రి నాగేశ్వరరావు గ్రామంలో మీ సేవ కేంద్రం నిర్వహిస్తుండగా, భావన తండ్రి ముల్కనూర్‌ గ్రామ ఉప సర్పంచ్‌ కోటేశ్వరరావుగా పనిచేస్తున్నారు.

Also Read :  Telangana Assembly 2025: అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత.. మాజీ సర్పంచ్ ల ఆందోళన

గార్ల గ్రామంలో విషాదచాయలు

ఇద్దరి వయసు 24 సంవత్సరాలు మాత్రమే. అయితే ఇద్దరు విద్యార్థినులు మరణించడంతో గార్ల గ్రామంలో విషాదం అలుముకుంది. కాలిఫోర్నియాలో జరిగిన మరణించడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటుతున్నాయి. ఇద్దరు విద్యార్థినులు ఒకే గ్రామానికి చెందిన వారు కావడం కారు ప్రమాదం(Car Accident) లో మరణించడంతో విషాదచాయలు అలుముకున్నాయి. మృతదేహాలను భారత్ కు రప్పించేందుకు సహకరించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

Also Read :  రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు.. KCR కండీషన్‌తో BRS ప్లాన్ ఇదే!

Advertisment
తాజా కథనాలు