Accident: హిమాచల్ లో దారుణం..రాయిని ఢీకొట్టిన కారు..ఆరుగురు మృతి
హిమాచల్ ప్రదేశ్ లో దారుణమైన రోడ్డు ప్రమాదం జరిగింది. పై నుంచి పడిన రాయి ఢీకొట్టిన కారు లోయలో పడింది. దీంట్లో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు.
హిమాచల్ ప్రదేశ్ లో దారుణమైన రోడ్డు ప్రమాదం జరిగింది. పై నుంచి పడిన రాయి ఢీకొట్టిన కారు లోయలో పడింది. దీంట్లో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు.
హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై ఓ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొంది. సచివాలయం నుంచి ఖైరతాబాద్ వెళ్తుండగా కారు డివైడర్‌ను ఢీకొంది. కారు వెనుక టైర్లో గాలి తక్కువ ఉండటంతో ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. కారులో బెలూన్స్ తెరుచుకోవడంతో ఎవరూ గాయపడలేదు.
ఢిల్లీలో ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. వసంత విహార్‌లో జూలై 9న వేగంగా వచ్చిన ఆడి కారు ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న ఐదుగురు కూలీలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక చిన్నారి సహా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. కారు డ్రైవర్ మద్యంమత్తులో ఉన్నాడని పోలీసులు తెలిపారు.
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ కు చెందిన కుటుంబం సజీవ దహనమైంది. డల్లాస్‌లో నివాసం ఉండే శ్రీ వెంకట్, తేజస్విని దంపతులు తమ పిల్లలతో కలిసి సెలవుల్లో అట్లాంట వెళుతుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. నలుగురు కారులోనే సజీవ దహనమయ్యారు.
మేడ్చల్ -మల్కాజ్ గిరి జిల్లా ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తెల్లవారు ఝామున రోడ్డు ప్రమాదం జరిగింది. మాధారం-ఎదులాబాద్ దారిలో కారు అదుపు తప్పి కరెంట్ పోల్ ను ఢీకొట్టింది. ఇందులో ఇద్దరు ఐటీ ఉద్యోగులు అక్కడిక్కడే మృతి చెందారు.
మహారాష్ట్రలోని నాందేడ్ కు చెందిన పెళ్లిబృందానికి జగిత్యాల జిల్లా కొండగట్టు సమీపంలో రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మూడేళ్ల చిన్నారి రుద్ర అక్కడికక్కడే మృతి చెందగా, వరుడితో పాటు మరో ఐదుగురు గాయపడ్డారు. దీంతో పెళ్లి ఆగిపోయింది.
హైదరాబాద్ గచ్చిబౌలిలో రన్నింగ్ కారులో మంటలు చెరరేగాయి. సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయం ముందు కారు పూర్తిగా దగ్దమైంది. కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు సురక్షితంగా బయటపడ్డారు. మంటల్లో పూర్తిగా కాలి బూడిదైంది.
తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రంగంపేట మండలం వడిసలేరు వద్ద కారు, ట్యాంకర్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని కాకినాడ ఆసుపత్రికి తరలించారు.