Assembly Sessions: రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు.. KCR కండీషన్‌తో BRS ప్లాన్ ఇదే!

రేపటి(డిసెంబర్) 29 నుంచి తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానుడడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. ముఖ్యంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ సమావేశాలకు హాజరవుతున్నాడని టాక్ నడుస్తోంది.

New Update
BRS Party

రేపటి(డిసెంబర్) 29 నుంచి తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు(assembly-sessions) ప్రారంభం కానుడడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. ముఖ్యంగా బీఆర్ఎస్(brs) అధినేత కేసీఆర్(kcr assembly speech) ఈ సమావేశాలకు హాజరవుతున్నాడని టాక్ నడుస్తోంది. దీంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కృష్ణా జలాలపై పవర్ పాయంట్ ప్రసెంటేషన్ ఇచ్చేందుకు అవకాశం ఇస్తా అసెంబ్లీకి వచ్చేందుకు కేసీఆర్ సిద్ధమని స్పష్టం చేశారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కార్ కేసీఆర్ కండీషన్‌ను ఒప్పుకుంటుందా అని ఆసక్తి నెలకొంది.

Also Read :  మా డాడీ ఎవరో తెలుసా? అంటే కుదరదు.. మందుబాబులకు CP సజ్జనార్ వార్నింగ్!

అసెంబ్లీకి గులాబీ బాస్: పక్కా మాస్టర్ ప్లాన్‌తో సిద్ధం

దాదాపు ఏడాది కాలంగా అసెంబ్లీకి దూరంగా ఉంటున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, రేపటి తొలిరోజు సమావేశాలకు హాజరుకావాలని నిర్ణయించుకున్నారు. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో పార్టీ ముఖ్య నేతలతో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు. కేవలం హాజరుకావడమే కాకుండా, అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేలా ఒక 'పక్కా మాస్టర్ ప్లాన్' రూపొందించినట్లు తెలుస్తోంది. అధికార కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసే ఎజెండాను బట్టి అప్పటికప్పుడు వ్యూహాలను మార్చుకుంటూ ముందుకు వెళ్లాలని కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలకు సూచించారు.

ప్రజా సమస్యలపై సమగ్రంగా చర్చించేందుకు అసెంబ్లీ సమావేశాలను కనీసం 15 రోజుల పాటు నిర్వహించాలని, ఈ విషయంలో వెనక్కి తగ్గకుండా ప్రభుత్వాన్ని నిలదీయాలని దిశానిర్దేశం చేశారు. దక్షిణ తెలంగాణకు జీవనాడి అయిన పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్ట్ గురించి అసెంబ్లీలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని, అవసరమైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని కేసీఆర్ ప్రణాళికలు వేశారు.

Also Read :  నీళ్లనుకుని కెమికల్ ఇచ్చిన తల్లి.. కొడుకు మృతి

తెలంగాణకు తీరని అన్యాయం: కేసీఆర్ ఆగ్రహం

ఇటీవల సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి వల్ల తెలంగాణకు, ముఖ్యంగా నీటి వాటాల విషయంలో తీరని అన్యాయం జరుగుతోందని మండిపడ్డారు. "కాంగ్రెస్ పార్టీ నాడు, నేడు ఎప్పుడూ తెలంగాణకు ద్రోహమే చేస్తోంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం పుట్టిన బీఆర్ఎస్ మాత్రమే నిఖార్సైన పోరాటం చేయగలదు" అని ఆయన వ్యాఖ్యానించారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం కేవలం సభకే పరిమితం కాకుండా, ప్రజల్లోకి వెళ్లాలని కేసీఆర్ నిర్ణయించారు. పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టు బాధితుల పక్షాన, నీటి హక్కుల కోసం క్షేత్రస్థాయిలో బలంగా పని చేద్దామన్న పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించే అవకాశం ఉంది. రేపటి నుండి జరగబోయే ఈ సమావేశాలు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్లుగా సాగనున్నాయి. కేసీఆర్ రాకతో అసెంబ్లీ వేదికగా జరిగే చర్చలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త మలుపులు తిప్పే అవకాశం కనిపిస్తోంది.

Advertisment
తాజా కథనాలు