Dire Wolf: 10 వేల ఏళ్ల క్రితం అంతరించిపోయిన తోడేళ్లు మళ్లీ తిరిగొస్తున్నాయ్..!!

కోలోసల్ బయోసైన్సెస్ సంస్థ డీఎన్ఏ, జన్యు ఇంజినీరింగ్ ద్వారా 10,000 ఏళ్ల క్రితం అంతరించిపోయిన డైర్ వోల్ఫ్‌లను మళ్లీ పుట్టించింది. ఈ విజయాన్ని ప్రపంచం ప్రశంసిస్తోంది, ఎలాన్ మస్క్ సైతం తనికు ఒక ఏనుగు పిల్లని తయారు చేయాలంటూ సరదాగా స్పందించారు.

New Update
Dire Wolf

Dire Wolf

Dire Wolf: 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' చూసినవాళ్లకు అందులో కనిపించే భయంకరమైన తోడేళ్లు గుర్తుండే ఉంటాయి. అయితే, వీటికి ప్రేరణగా నిలిచిన నిజమైన జాతి పేరు డైర్ వోల్ఫ్. ఇవి అసలు భూమ్మీద 10,000 ఏళ్ల క్రితమే అంతరించిపోయింది. ఇప్పుడదే జాతి, మళ్లీ తిరిగి భూమిపై శ్వాస తీసుకుంటోంది!

అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన కోలోసల్ బయోసైన్సెస్‌ అనే సంస్థ విజ్ఞానంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. జన్యు ఇంజినీరింగ్‌ (Genetic Engineering), క్లోనింగ్‌, డీఎన్‌ఏ సాంకేతికత సాయంతో ముగ్గురు తోడేళ్ల పిల్లలను ప్రయోగశాలలో పుట్టించింది. రోములస్‌, రేమస్‌, ఖలీసి గా వీటికి పేరులు కూడా పెట్టారు.

Also Read: అక్టోబర్ నుండి ఛార్జ్ తీసుకోనున్న సిన్సియర్ పోలీస్ ఆఫీసర్..

తొలిసారిగా అంతరించిపోయిన జాతికి మళ్లీ జీవం..!

ఇది ప్రపంచంలో తొలిసారిగా జరగడం గమనార్హం. శాస్త్రవేత్తలు డైర్ వోల్ఫ్ జాతికి దాదాపు సంభందితమైన గ్రే వోల్ఫ్ డీఎన్ఏను తీసుకుని, అందులో పాత డైర్ వోల్ఫ్ లక్షణాలను జోడించి కొత్త జాతిని రూపొందించారు. పాత డీఎన్ఏ చాలా భాగం ధ్వంసమైపోయినప్పటికీ, అందులోంచి ముఖ్యమైన జెనెటికల్ కోడ్‌ను తీసుకుని  ఇప్పుడు ఉన్న జంతువుల్లోకి మార్చి ప్రవేశపెట్టారు.

కోలోసల్ బయోసైన్సెస్‌ చెప్పినట్లుగా, ఈ ప్రయోగం డీ-ఎక్స్‌టింక్షన్ (De-extinction) రంగంలో ఒక పెద్ద ముందడుగు. "ఇది శాస్త్రీయంగా ఒక విప్లవాత్మక ప్రయోగం. "మేము నాన్-ఇన్వేసివ్ బ్లడ్ క్లోనింగ్‌ టెక్నాలజీ సాయంతో ఈ జంతువులను సృష్టించగలిగాం. ఇది భవిష్యత్తులో మరిన్ని అంతరించిపోయిన జాతులను తిరిగి తీసుకురావడానికి బేస్‌లైన్ అవుతుంది," అని సంస్థ పేర్కొంది.

Also Read: భారీ యాక్షన్ అడ్వెంచర్‌కు సిద్ధమైన కమల్ హాసన్

భయంకరమైనవే కాదు- అందమైనవీ కూడా!

సోషల్ మీడియాలో విడుదలైన వీడియోలలో ఈ తోడేళ్లను చూస్తే, తెల్లగా మెరిసే జుత్తుతో, తక్కువ వయస్సులోనే నాలుగు అడుగుల పొడవు, 36 కిలోలకుపైగా బరువుతో క్యూట్‌గా అరుస్తున్నాయి. అక్టోబర్ 1, 2024న ఈ ముగ్గురు పుట్టారు. వీరి అరుపులు 10 వేల ఏళ్ల తర్వాత మళ్లీ ఈ భూమ్మీద వినబడుతున్నాయని చెప్పటమే కాదు, చూపించడంలో కూడా కంపెనీ విజయవంతమైంది.

ప్రస్తుతం వీరు ఎక్కడ ఉన్నారు?

ఈ ముగ్గురు తోడేళ్లను కంపెనీ ఉత్తర అమెరికాలోని 2,000 ఎకరాల ప్రైవేట్ ప్రదేశంలో సంరక్షిస్తోంది. వారి భద్రత, ఆరోగ్యం, అభివృద్ధిపై శాస్త్రవేత్తల ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.

Also Read: గ్రాఫిక్స్ గాలికి వదిలేశారా..? విశ్వంభరపై 'బన్ని' ప్రొడ్యూసర్ హాట్ కామెంట్స్

తిరిగి పుట్టిన డైర్ వోల్ఫ్: విజ్ఞాన విజయానికి మారుపేరు

శాస్త్రవేత్తల అద్భుత శ్రమతో, ఒకసారి అంతరించిన జాతి మళ్లీ భూమిపైకి రాబడడం ఎంతో గొప్ప విషయం. కానీ ఈ ప్రయోగంతోపాటు ఒక ముఖ్యమైన ప్రశ్నను కూడా మనం అర్థం చేసుకోవాలి  “ప్రకృతి అంత చేసిన జాతిని మనం తిరిగి సృష్టించడం ఎంత వరకు భావ్యం?” అని. ఈ ప్రయోగం శాస్త్రవేత్తల నైపుణ్యానికి నిదర్శనం, అలాగే ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యతను మనకు గుర్తుచేస్తుంది.

అరుదైన తోడేళ్లను తిరిగి భూమిపైకి తీసుకురావడంపై కోలోసల్ బయోసైన్సెస్‌ సీఈవో మరియు సహ వ్యవస్థాపకుడు బెన్ లామ్ స్పందించారు. తమ బృందం సాధించిన ఈ విజయాన్ని ఒక చారిత్రక ఘట్టంగా అభివర్ణించారు.

బెన్ లామ్ తెలిపిన వివరాల ప్రకారం, వారు 13,000 సంవత్సరాల నాటి తోడేలు దంతం, 72,000 సంవత్సరాల నాటి పురాతన పుర్రె నుంచి డీఎన్ఏను సేకరించి, అత్యాధునిక టెక్నాలజీ ద్వారా భయంకరమైన తోడేలు పిల్లలను పుట్టించారు. ఇది శాస్త్రీయ రంగంలో ఓ సెన్సేషన్‌గా మారింది.

Also Read: 'చూపుల్తో గుచ్చి గుచ్చి’ మాస్ జాతర ప్రోమో సాంగ్ అదిరిపోయిందిగా..!

ఎలాన్ మస్క్ స్పందిస్తూ.. 

ఈ అద్భుత ప్రాజెక్ట్‌ మీద ప్రపంచంలోని ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ కూడా స్పందించారు. కోలోసల్ విజయం పట్ల ఆయన అభినందనలు తెలుపుతూ, "ఇది నిజంగా గొప్ప విషయం," అని ప్రశంసించారు.

అయితే, ఎలాన్ మస్క్ మార్క్ కామెడీ కూడా మిస్సవలేదు! “అలాగే నా కోసం అంతరించిపోయిన ఓ చిన్న ఏనుగును కూడా తయారు చేయండి!” అంటూ సరదాగా కామెంట్ చేశారు. 

భవిష్యత్తులో ఇంకా ఎన్ని ఆశ్చర్యాలు?

ఇంతటి పురాతన జాతికి తిరిగి శ్వాసను అందించడం అంటే కేవలం ఒక శాస్త్రీయ విజయం మాత్రమే కాదు, అది మన భావితరాల భవిష్యత్తు గురించి ఆలోచించడానికి కొత్త దారి చూపే ఘట్టం కూడా. కోలోసల్ చేసిన ఈ అద్భుత ప్రయోగం, మానవ విజ్ఞానాన్ని ఎటువైపు తీసుకుపోతోందో చూడాలి.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు