/rtv/media/media_files/2025/04/16/fpoPJPX72Gig6QmWUDVL.jpg)
bihar fire accident
గ్యాస్ సిలిండర్ పేలి నలుగురు చిన్నారులు చనిపోయిన దుర్ఘటన బీహార్‌లోని ముజఫర్ పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. బుధవారం తల్లి ఇంట్లో వంట చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ముజఫర్‌పూర్ జిల్లా బరియార్‌పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రాంపూర్‌మని గ్రామంలో మహిళ ఇంట్లో వంట చేస్తూ మిగతా వంటపాత్రలు కడిగేందుకు బయటికి వెళ్లింది. తల్లి బయటకు వెళ్లికా స్టవ్ మంటలు సిలిండర్‌కు అంటుకుని పేలుడు సంభవించింది. దాంతో ఇంట్లో ఉన్న నలుగురు చిన్నారులు బ్యూటీ కుమారి, విపుల్ కుమార్, సృష్టి కుమారి, హన్సిక కుమారి అక్కడికక్కడే సజీవ దహనం అయ్యారు.
मुजफ्फरपुर के रामपुर मणि गैस सिलिंडर फटने से भीषण आग से दलित समाज के 4 मासूम बच्चों की दर्दनाक मौत हुई और करीब 30 घर जलकर राख हो गए। घटना ने पूरे इलाके को दहला दिया है।
— BSP Bihar (@BSP4Bihar) April 16, 2025
मोदी जी सिर्फ गैस की कीमतें बढ़ाने पे यकीन रखते हैं उज्वला योजना के तहत मिले सिलिंडर की गुणवत्ता पे नहीं। pic.twitter.com/NTs05Shk1y
Also read: Waqf Board Act: వక్ఫ్ బోర్డు చట్టంలో కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు
ఇంట్లో వంట చేస్తూ తల్లి బయటికి వెళ్లిన సమయంలో గ్యాస్ సిలిండర్‌కు మంటలు అంటుకొని పేలుడు సంభవించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని చెప్పారు. బాధిత కుటుంబానికి ఒక్కొక్కరికి రూ.4 లక్షల చొప్పున మొత్తం 16 లక్షలు అందజేయనున్నట్లు ముజఫర్‌పూర్ జిల్లా కలెక్టర్ తెలిపారు. ఒకేసారి ముగ్గురు చిన్నారులు మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆ కుటుంబసభ్యులు, బందువులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.
Also read: Donald Trump: ట్రంప్ టార్గెట్ హార్వర్డ్.. యూనివర్సిటీపై తన స్టైల్లో జోకులు