Batti Vikramarka: తెలంగాణ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
తెలంగాణలో ఉద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. పెండింగ్ బిల్లులకు సంబంధించి రూ.707.30 కోట్ల నిధులు విడులయ్యాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దీనికి సంబంధించి ఆదేశాలు జారీ చేశారు.
తెలంగాణలో ఉద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. పెండింగ్ బిల్లులకు సంబంధించి రూ.707.30 కోట్ల నిధులు విడులయ్యాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దీనికి సంబంధించి ఆదేశాలు జారీ చేశారు.
ఐదేళ్ల క్రితం రేవంత్‌పై ఈడీ కేసు నమోదు చేస్తే ఇప్పటివరకు ఎందుకు అరెస్టు చేయలేదని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. బీహార్ ఎన్నికలకు డబ్బులు పంపుతున్నారని ఢిల్లీలోని భట్టి విక్రమార్క ఇంట్లో ఐటీ రైడ్లు జరిగాయని ఆరోపించారు.
తెలంగాణలో రేపటి నుంచి ప్రైవేటు కళాశాలలు తెరుచుకోనున్నాయి. రూ.900 కోట్ల బకాయిలు విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరిచింది. మూడు రోజుల్లో రూ.600 కోట్లు విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు.
తెలంగాణలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. నిన్నమొన్నటివరకు ముఖ్యమంత్రితో విభేదిస్తూ వచ్చిన కొండా సురేఖ దంపతులు సోమవారం రేవంత్ రెడ్డితో ఆయన నివాసంలో సమావేశమయ్యారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ సమక్షంలో వారి భేటీ జరిగింది.
ఢిల్లీ పర్యటనలో భాగంగా రెండో రోజు సీఎం రేవంత్ రెడ్డి , డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క లోక్‌సభా పక్ష నేత రాహుల్ గాంధీ, రాజ్యసభ విపక్ష నేత మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. ఈ మేరకు సీఎం రేవంత్, రాహుల్‌తో కలిసి ఖర్గే నివాసానికి చేరుకున్నారు.
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల మెడికల్ బిల్లుల బకాయిలు మంజూరు చేసింది. రూ.180.38 కోట్ల వైద్య బిల్లుల బకాయిలు చెల్లించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. దీంతో 26,519 మంది ఉద్యోగులు, పెన్షనర్లకు ఊరట లభించింది.
తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ఇవాళ (శనివారం) సాయంత్రం ఈ వేడుక ఘనంగా మెుదలైంది. ఈ కార్యక్రమానికి సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖలతోపాటు రాజకీయ ప్రముఖులు సైతం పెద్దఎత్తున హాజరయ్యారు.
పాలమూరు బిడ్డనని చెప్పుకోవడానికి ఎంతో గర్వపడుతున్నానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నాగర్ కర్నూల్ పర్యటనలో భాగంగా ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ పథకం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఒకప్పుడు నల్లమల అంటే వెనుకబడిన ప్రాంతంగా ఉండేదన్నారు.
'ఇందిర సౌర గిరి జల వికాసం' పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. నాగర్‌కర్నూల్ జిల్లా మాచారంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అటవీ హక్కుల చట్టం కింద 6.69 లక్షల ఎకరాలకు పోడుపట్టాలు మంజూరు చేశారు. దీనికోసం రూ.600 కోట్లు ఖర్చుచేయనున్నారు.