Lift Accident: సీఎం రేవంత్ కు తప్పిన పెను ప్రమాదం

నోవాటెల్ హోటల్లో సీఎం రేవంత్ రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. సీఎం ఎక్కిన లిఫ్ట్ మధ్యలో ఆగిపోయింది. ఎనిమిది మంది ఎక్కాల్సిన లిఫ్ట్ లో 13 మంది ఎక్కడంతో లిఫ్ట్ మొరాయించినట్లు తెలుస్తోంది.

New Update
Telangana CM Revanth Reddy

Telangana CM Revanth Reddy

నోవాటెల్ హోటల్లో సీఎం రేవంత్ రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. సీఎం ఎక్కిన లిఫ్ట్ మధ్యలో ఆగిపోయింది. ఎనిమిది మంది ఎక్కాల్సిన లిఫ్ట్ లో 13 మంది ఎక్కడంతో లిఫ్ట్ మొరాయించినట్లు తెలుస్తోంది. దీంతో ఏం జరుగుతుందో తెలియక అధికారులు టెన్షన్ కు గురయ్యారు. హోటల్ సిబ్బంది, సీఎం సెక్యూరిటీ అధికారులు వెంటనే అప్రమత్తమై లిఫ్ట్‌ ఓపెన్ చేయడంతో ప్రమాదం తప్పింది. సీఎంను వేరే లిఫ్ట్ లో సెకండ్ ఫ్లోర్ కు తీసుకువెళ్లారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఎనిమిది మంది మాత్రమే ఎక్కాల్సిన లిఫ్ట్ లోకి 13 మందిని ఎలా పంపారనే విషయంలో సెక్యూరిటీ సిబ్బందిపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

Also Read :  కేసీఆర్‌ మంచోడు... నేను రౌడీ.. కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు

పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లండి..

నోవాటెల్ హోటల్ లో సీఎం రేవంత్ అధ్యక్షతన ఈ రోజు సీఎల్పీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రేవంత్ మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని కొన్ని సమస్యలకు మన ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపిందన్నారు. రేషన్ కార్డుపై సన్నబియ్యం అందించే పథకం ఒక అద్భుతమన్నారు. ఆనాడు రూ.2 కిలో బియ్యంలా ఇప్పుడు సన్నబియ్యం పథకం శాశ్వతంగా గుర్తుండే స్కీమ్ అని వివరించారు.

Also Read :  కాంగ్రెస్ గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా.. ఎర్రబెల్లి బస్తిమే సవాల్

భూ భారతిని రైతులకు చేరవేయాలన్నారు. దేశంలోనే ఇందిరమ్మ ఇండ్లు పథకం ఆదర్శంగా నిలిచిందన్నారు. క్షేత్ర స్థాయిలో నిజమైన లబ్ది దారులకు ఇందిరమ్మ ఇండ్లు అందించాలన్నారు. దీన్ని క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. కులగణన ద్వారా వందేళ్ల సమస్యను శాశ్వతంగా పకడ్బందీగా పరిష్కరించామన్నారు. విద్యా, ఉద్యోగ, రాజకీయాల్లో బలహీన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని బిల్లులు తీసుకొచ్చామన్నారు. ఇది మన పారదర్శక పాలనకు నిదర్శనమన్నారు. జఠిలమైన ఎస్సీ ఉపకులాల వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపామన్నారు. 

Also Read :  వీరమల్లు విడుదల డౌటే..? పవన్ ఫ్యాన్స్ కి షాకింగ్ న్యూస్

Also Read :  కడుపుతో ఉన్న భార్యను ఎందుకు చంపాడంటే.. షాకింగ్ విషయాలు చెప్పిన విశాఖ పోలీసులు.. !

 

lift-accident | revanth-reddy | novatel-hotel | latest-telugu-news | today-news-in-telugu | latest telangana news | breaking news in telugu

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు