/rtv/media/media_files/2025/05/01/j3oE25E40pQwLGnUsjQA.jpg)
India, Usa, Pakistan
భారత్, పాకిస్తాన్..మధ్యలో అమెరికా. అగ్రరాజ్యం ఇరు దేశాలకు సంధి కుదర్చడానికి ప్రయత్నిస్తోందా..లేకపోతే యుద్ధానికి సంబంధించి ఏమైనా మాట్లాడుతోందా...అసలేం జరగుతోంది. భారత విదేశాంగ్ మంత్రి జైశంకర్, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ లతో అమెరికా విదేశాంగ మంత్రి మార్కూ రూబియో మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితులు, యుద్ధం గురించి ఇద్దరితో విడివిడిగా చర్చించారు. అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ బ్రూస్ చెప్పినదాని ప్రకారం మార్కో..జైశంకర్ కు ఫోన్ చేసి పహల్గామ్ దాడిపై తీవ్ర సంతాపం తెలిపారు. ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటానికి మద్దతునిస్తామని హామీ ఇచ్చారు. అయితే యుద్ధం జరగకుండా ఉండేలా చూడాలని మార్కో కోరినట్లు చెబుతున్నారు. రెండు దేశాల మధ్యనా ఉద్రిక్తతలు తగ్గించి..శాంతి కాపాడ్డానికి భారత్, పాకిస్తాన్ రెండూ పాటు పడాలని ఆయన కోరారు.
Secretary of State Marco Rubio spoke with Indian External Affairs Minister Dr S Jaishankar today. The Secretary expressed his sorrow for the lives lost in the horrific terrorist attack in Pahalgam, and reaffirmed the United States' commitment to cooperation with India against…
— ANI (@ANI) April 30, 2025
పాక్ ప్రధానికి కూడా కాల్..
మరోవైపు మార్కో రూబియో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తో కూడా మాట్లాడారు. అక్కడ ప్రాంతీయ పరిస్థితులపై షెహబాజ్...మార్కోకు వివరించినట్లు తెలుస్తోంది. భారత దేశం రెచ్చగొట్టేలా వ్యవహరిస్తోంది ఆరోపించారు. తాము ఉగ్రవాదాన్ని నాశనం చేయడానికి చూస్తున్నామని..కానీ భారత్ తమను దృష్టి మరల్చేలా చేస్తోందని చెప్పారు. ఫమల్గామ్ దాడితో తమ దేశానికి ఎటువంటి సంబంధం లేదని పాక్ ప్రధాని చెప్పినట్లు తెలుస్తోంది. రెచ్చగొట్టే ప్రకటనలు చేయవద్దని భారత్ కు చెప్పాలని షెహబాజ్ అమెరికాను కోరారని చెబుతున్నారు.
today-latest-news-in-telugu | india | pakistan | usa
Also Read:Ind-Pak: పాకిస్తాన్ కు మరో షాక్..ఫ్లైట్స్ ఎంట్రీకి నో