/rtv/media/media_files/2025/04/18/O660lvejIi7zsNBmragM.jpg)
life style astrology
Life Style: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఏప్రిల్ 19న ప్రత్యేక యోగం ఏర్పడనుంది. శని, శుక్ర గ్రహాల కలయిక మీనా రాశిలో జరుగుతోంది. ఈ యోగం విలాసం, సిరిసంపదలు, ఆనందాలకు శుభప్రదంగా పరిగణించబడుతుంది. దీంతో పాటు చంద్రుడు ధనుస్సు రాశిలో ఉండడం.. తెలివితేటలు, శ్రేయస్సుకు శుభసూచకం. అయితే ఈ ప్రత్యేకమైన రోజున మూడు వస్తువులను తాకడం ద్వారా బంపర్ ప్రయోజనాలు ఉంటాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
ఈ మూడు వస్తువులు తాకండి
ఆవు వీపు
మత విశ్వాసాల ప్రకారం గోమాతలో కొన్ని కోట్ల దేవతలు కొలువుంటారని నమ్ముతారు. అందుకే ఆవును గోమాతా అంటారు. ఆవును తాకడం ద్వారా సకల దేవతల ఆశీస్సులు లభిస్తాయి. ప్రత్యేక తిథి యోగం ఏర్పడుతున్న ఏప్రిల్ 19న ఆవు వీపును తట్టి.. మీ మనసులో కోరికను వ్యక్తపరచండి. ఇలా చేయడం ద్వారా దురదృష్టం తొలగిపోవడం, ఇంట్లో సంపద చేకూరడం, గ్రహ దోషాల నుంచి విముక్తి కలుగుతుందని నమ్ముతారు.
శంఖం
శంఖం, శ్రీయంత్రం లక్ష్మీదేవికి ఇష్టమైన చిహ్నంగా భావిస్తారు. ఏప్రిల్ 19న శంఖాన్ని నీటితో కడిగి పూజ స్థలంలో ఉంచాలి. ఆ తర్వాత శ్రీయంత్రంపై కుంకుమ, తామర గింజలు సమర్పించండి. ఆపై "ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మ్యై నమః" అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఇలా చేయడం ఇంట్లో సిరిసంపదలను కలిగిస్తుంది. అలాగే ప్రతికూల శక్తిని తొలగించి.. మానసిక ప్రశాంతతను అందిస్తుంది.
రాగి నాణెం
రాగి శాస్త్రం, ఆధ్యాత్మిక దుక్కోణం ప్రకారం.. రాగి నాణెనాన్ని లక్ష్మీదేవి వాహనంగా పరిగణిస్తారు. ఏప్రిల్ 19న రాగి నాణెం చేతిలో పట్టుకొని 'ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః' అనే మంత్రాన్ని జపించి.. ఆపై ఆ నాణెనాన్ని పర్సులో లేదా జేబులో ఉంచడండి. ఇలా చేయడం ద్వారా సంపదలో స్థిరత్వం, ఊహించని ఖర్చుల నుంచి విముక్తి , ఆర్ధిక సమస్యలు తొలగిపోతాయి.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.
Also Read: Jagamerigina Satyam: తెలంగాణ మట్టి వాసనను గుర్తుచేసేలా మరో సినిమా.. రవితేజ మేనల్లుడు హీరోగా!