Chain Snatching : నగరంలోకి చైన్ స్నాచింగ్స్ ముఠా...పోలీసుల హై అలర్ట్‌

సంక్రాంతి సెలవుల మూలంగా హైదరాబాద్‌ దాదాపు నిర్మాన్యూషంగా మారింది. దీంతో చైన్ స్నాచింగ్స్ ముఠా రంగంలోకి దిగింది. రోడ్లపైన జనసంచారం ఎక్కువ లేనిది ఆసరాగా చేసుకుని ఓ ముఠా మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో వరుసగా చైన్ స్నాచింగ్స్ లకు పాల్పడుతోంది.

New Update
FotoJet - 2026-01-17T180046.116

Chain Snatching

Chain Snatching: సంక్రాంతి సెలవు(Sankranti Holidays 2026)ల మూలంగా హైదరాబాద్‌ దాదాపు నిర్మాన్యూషంగా మారింది. దీంతో చైన్ స్నాచింగ్స్(chain-snatching) ముఠా రంగంలోకి దిగింది. రోడ్లపైన జనసంచారం ఎక్కువ లేనిది ఆసరాగా చేసుకుని ఓ ముఠా వరుసగా చైన్ స్నాచింగ్స్ లకు పాల్పడుతోంది. ముఖ్యంగా మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో వరుసగా చైన్ స్నాచింగ్ ఘటనలు ప్రజల్ని భయాందోళనకు గురిచేస్తున్నాయి. చైతన్యపురి(Chaitanyapuri), నాగోల్(nagole), హయత్ నగర్(Hayat Nagar) తదితర ప్రాంతాల్లో మహిళలను లక్ష్యంగా చేసుకుని ముఠా దోపిడీలకు పాల్పడుతోంది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ముఠాపై ప్రత్యేక దృష్టి సారించారు. సీసీటీవీ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు.

Also Read :  కారుతో తొక్కించి.. బంగ్లాదేశ్‌లో మరో హిందూ దారుణ హత్య

Chain Snatching Gang Enters The City

దారివెంట ఒంటిరిగా వెళ్తున్న వారు  ముఖ్యంగా మహిళలను లక్ష్యంగా చేసుకుని దుండగులు ద్విచక్ర వాహనాలపై వచ్చి బంగారు గొలుసులు లాక్కుని పరారవుతున్నారు. ఈ ఘటనపై బాధితులు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం.. హయత్ నగర్ పరిధిలోని అంజనాద్రి నగర్‌లో ఉండే విజయ అనే మహిళ మెడలో 3.3తులాల పుస్తెలతాడును దొంగలు లాక్కెళ్లారు. నాగోల్ బ్లైండ్స్ కాలనీలో మనమ్మ అనే మహిళ మెడలోని 2.5 తులాల బంగారు గొలుసును ముఠా ఎత్తుకెళ్లింది. చైతన్యపురి(chaitanyapuri crime) ఆర్కేపురంలో ఆదిలక్ష్మి అనే మహిళ మెడ నుంచీ కూడా 1.5 తులాల బంగారు  చైన్ లాక్కెళ్లారు. వరుస చైన్ స్నాచింగ్ చోరీలతో మహిళలు భయాందోళనకు గురవుతున్నారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్న నిందితులు ఒంటరిగా నడుస్తున్న మహిళలు, వృద్ధులను లక్ష్యంగా చేసుకుంటున్నట్లు గుర్తించారు. ఉదయం, సాయంత్రం వేళల్లో.. రద్దీ తక్కువగా ఉన్న రహదారులను ఎంచుకుని ముఠా చోరీలకు పాల్పడుతోంది. ద్విచక్ర వాహనాలపై వేగంగా వచ్చి, ఒక్కసారిగా గొలుసు లాక్కుని క్షణాల్లో అక్కడి నుంచి పారిపోతున్నారని మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కాగా మల్కాజ్‌గిరి కమిషనరేట్ పరిధిలోని చైతన్యపురి, నాగోల్, హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధుల్లో వరుసగా మూడు చైన్ స్నాచింగ్ కేసులు నమోదు కావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. రోజుల వ్యవధిలోనే వరుసగా ఘటనలు జరగడంతో ఇది ఒకే గ్యాంగ్ పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా ఈ ఘటనల నేపథ్యంలో పోలీసులు కేసులు నమోదు చేసి ప్రత్యేక బృందాలతో దర్యాప్తు ప్రారంభించారు. చైన్ స్నాచింగ్ ఘటనలు జరిగిన ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీని సేకరించి విచారణ జరుపుతున్నారు. అనుమానాస్పద ద్విచక్ర వాహనాలు, వ్యక్తుల కదలికలపై ప్రత్యేక దృష్టి పెట్టామని, త్వరలోనే నిందితులను గుర్తించి అరెస్ట్ చేస్తామంటున్నారు. ఈ ఘటన జరిగిన సమయాల్లో రోడ్లపై ఉన్నసీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తూ.. దుండగుల రాకపోకల మార్గాలను పరిశీలిస్తున్నారు. ఈ ఫుటేజీ ఆధారంగా నిందితుల స్కెచ్ తయారుచేస్తున్నట్లు అధికారులు తెలిపారు.నిందితులు ఒకే గ్యాంగ్‌కు చెందిన వారా? ఇతర ప్రాంతాల్లోనూ ఇలాంటి ఘటనలు జరిగాయా? అన్న అంశాలపై పోలీసులు సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే ఈ కేసుల్లో పురోగతి ఉంటుందని పోలీసులు వెల్లడించారు.

కాగా  ఘటనల నేపథ్యంలో పోలీసులు హై అలర్ట్‌ ప్రకటించారు. స్థానిక మహిళలు, వృద్ధులు మార్నింగ్ వాక్స్, దేవాలయ దర్శనాలు, మార్కెట్‌కు వెళ్లే సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.  మహిళలు ఒంటరిగా వెళ్లే సమయంలో బంగారు ఆభరణాలు ధరించకుండా ఉంటే మంచిదని చూచించారు. రోడ్డుపై నడిచేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని కోరారు. అనుమానాస్పద ద్విచక్ర వాహనాలు లేదా వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100 లేదా స్థానిక పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల సహకారంతోనే నేరాలను అరికట్టగలమని పోలీసులు పేర్కొన్నారు.

Also Read :  ఆన్‌లైన్ బెట్టింగ్‌ సైట్లకు కేంద్రం బిగ్ షాక్: మరో 242 వెబ్‌సైట్లు బ్లాక్!

Advertisment
తాజా కథనాలు