Coolie: అమెరికాలో 'కూలీ' ఊచకోత! విడుదలకు ముందే అన్ని కోట్ల వసూళ్లు చేసిన తొలి తమిళ్ సినిమా!

ప్రస్తుతం సోషల్ మీడియా అంతా సూపర్ స్టార్ రజినీకాంత్ 'కూలీ' వైబ్స్ తో నిండిపోయింది. మరో రెండు రోజుల్లో ఈమూవీ థియేటర్స్ లో విడుదల కానుండడంతో ఎక్కడ చూసిన దీని గురించే చర్చ! విడుదలకు ముందే సోషల్ మీడియాను ఊపేస్తోంది.

New Update
Coolie

Coolie

Coolie:  ప్రస్తుతం సోషల్ మీడియా అంతా సూపర్ స్టార్ రజినీకాంత్ 'కూలీ' వైబ్స్ తో నిండిపోయింది. మరో రెండు రోజుల్లో ఈమూవీ థియేటర్స్ లో విడుదల కానుండడంతో ఎక్కడ చూసిన దీని గురించే చర్చ! విడుదలకు ముందే సోషల్ మీడియాను ఊపేస్తోంది. తలైవా అభిమానుల్లో పండగ వాతావరణం నెలకొంది. భారీ కటౌట్లు, ఫ్యాన్ మేడ్ ప్రమోషన్స్ తో ఫుల్ హడావిడి చేస్తున్నారు.  ఇప్పటికే ఇండియాలో, ఓవర్ సీస్ లో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ మొదలవగా దుమ్ముదులుపుతోంది.  అమెరికా, యూకే వంటి దేశాల్లో టికెట్లు భారీగా అమ్ముడవుతున్నాయి.  ముఖ్యంగా నార్త్ అమెరికారిలో ప్రీమియర్ షోల ద్వారా రికార్డు వసూళ్లను రాబట్టింది.  

తొలి తమిళ్ సినిమాగా రికార్డు!

ఉత్తర అమెరికాలో ప్రీమియర్ షోస్  ప్రీ-సేల్స్‌లో $2 మిలియన్లు (దాదాపు ₹16.5 కోట్లకు) పైగా వసూళ్లు  సాధించిన తొలి తమిళ చిత్రంగా రజినీ 'కూలీ'  చరిత్ర సృష్టించింది. ఇది రజినీకాంత్ స్టార్‌డమ్, ఆయన క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో నిరూపించింది. ఈ రికార్డుతో 'కూలీ' గతంలో వచ్చిన విజయ్ తళపతి 'లియో' ప్రీమియర్ ప్రీ సేల్ రికార్డును బద్దలు కొట్టింది.   'లియో' సినిమా ప్రీమియర్ ప్రీ-సేల్స్ ద్వారా $1.8 మిలియన్లు వసూలు చేసింది. ఇప్పుడు 'కూలీ' $2 మిలియన్ దానిని అధికమించింది. విదేశాల్లో తలైవా సినిమాకు ఈ రేంజ్ లో రెస్పాన్స్ ఉండడం ఇదేం మొదటి సారి కాదు! గతంలో 'కబాలి' కూడా ప్రీమియర్ షోల ద్వారా భారీ వసూళ్లు రాబట్టింది.

ఇది మాత్రమే కాదు, తాజాగా చెన్నై లోని 'Uno Aqua Care' అనే సాఫ్ట్వేర్ కంపెనీ 'కూలీ' సినిమా చూసేందుకు తమ ఉద్యోగులకు సెలవు ప్రకటించడం మరింత హైప్ క్రియేట్ చేసింది. ఇది రజినీకాంత్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో చూపిస్తుంది. 

అయితే  ఈ సినిమా ప్రమోషన్స్ కూడా చాలా కొత్తగా చేస్తున్నారు. అమెజాన్ డెలివరీ బాక్సులపై సినిమా పోస్టర్లు ముద్రించడం వంటి ఐడియాలు నెటిజన్లను బాగా ఆకట్టుకున్నాయి. రజినీకాంత్ తో పాటు  నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర వంటి స్టార్స్ అంతా ఈ సినిమాలో ఉండడం ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తోంది. సినిమాలో  ఇంటర్వెల్, ఫ్లాష్‌బ్యాక్, క్లైమాక్స్ ఎపిసోడ్‌లు సినిమాకు హైలైట్‌గా హైలైట్ గా నిలవనున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. 

ఇక ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు, ట్రైలర్ తర్వాత ఫ్యాన్స్  అంచనాలు పీక్స్కి చేరాయి. ముఖ్యంగా ఈ సినిమాలో నాగార్జున విలన్‌గా నటిస్తున్నారని తెలియగానే అందరిలో ఆసక్తి మరింత పెరిగింది. నాగార్జున లుక్, ట్రైలర్లో ఆయన చెప్పిన డైలాగ్స్ కూడా సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయ్యాయి. వసూళ్లు చేసిన తొలి తమిళ్ సినిమా!

Also Read: రజనీకేనా విషెస్‌.. ఎన్టీఆర్‌కు లేవా.. సోషల్‌ మీడియాలో రచ్చ రచ్చ!

Advertisment
తాజా కథనాలు