/rtv/media/media_files/2025/08/07/green-card-2025-08-07-14-26-12.jpg)
Green Card
అమెరికాలో గ్రీన్ కార్డ్ ఉంది మా పిల్లల భవిష్యత్ సేఫ్ అని అనుకుంటున్నారా. అయితే ఇది మీ కోసమే. త్వరలోనే వీటి రూల్స్ మారనున్నాయి. భారత్ తో సహా అనేక దేశాలకు మరో షాక్ ఇవ్వడానికి రెడీ అయింది. గ్రీన్ కార్డ్ ఉన్న హెచ్ 1 బీ వీసాదారుల పిల్లలకు 21 ఏళ్ల తర్వాత వారి హోదాను కోల్పోనున్నారు. అంటే తల్లిదండ్రులకు గ్రీన్ కార్డ్ ఉన్నా కూడా వారి పిల్లలు అమెరికాలో ఉండలేదు. పిల్లలు అమెరికాలో ఉండాలంటే 21 ఏళ్ళ తర్వాత మళ్ళీ వీసా అప్లై చేసుకోవాల్సిందే. అమెరికాలో ఫ్రెష్ గా జీవితం మొదలెట్టాల్సిందే. ఈ రూల్ ను తొందరలోనే అమలు చేయనుంది యూఎస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ ఇమ్మిగ్రేషన్ అండ్ హోమ్ ల్యాండ్ . తల్లిదండ్రులకు అప్పటికే గ్రీన్ కార్డ్ ఉన్నా, దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నా కూడా ఇదే రూల్ అమలు అవుతుంది.
భారతీయులపై భారీ దెబ్బ..
ఈ కొత్త రూల్ ఆగస్టు 15 నుంచి అమల్లోకి రానుంది. ఆ రోజు లేదా ఆ తర్వాత దాఖలు చేసుకున్న దరఖాస్తుదారులకు ఇది వర్తిస్తుంది. అయితే గ్రీన్ కార్డ్ కోసం అప్లై చేసుకునే వాళ్ళకు ఈ రూల్ ముందు సులభతరం కానుంది. యూఎస్ నుంచి లేదా బయట నుంచి గ్రీన్ కార్డ్ దరఖాస్తు చేసుకున్నా కూడా ఒకేలా నియమాలు అమలు అవుతాయని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ తెలిపింది. కొత్త నియమం ప్రకారం, CSPA కింద వయస్సును లెక్కించడానికి వీసా ఎప్పుడు అందుబాటులో ఉందో నిర్ణయించడానికి USCIS ఇప్పుడు డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ తేదీల చార్ట్ లను రూపొందించనుంది. ఈ మార్పు దాదాపు అమెరికాలో ఉంటున్న 2 లక్షల మంది పిల్లలపై ప్రభావం చూపించనుందని తెలుస్తోంది. వీరు తమకు 21 ఏళ్ళు వచ్చాక అమెరికా వదిలి వెళ్ళిపోవాల్సి రావచ్చని అంటున్నారు. ఇక ఈ కొత్త మార్పు అత్యధికంగా భారతీయులపై ప్రభావం చూపించనుంది. ఇక్కడ హెచ్ 1 బీ, లేదా గ్రీన్ కార్డ్ పొందిన వారిలో ఎక్కువగా భారతీయులే అంటే..73 శాతం వరకూ వారే ఉన్నారు. అందుకే కొత్త రూల్ వారి పిల్లలపై తీవ్ర ప్రభావం చూపించనుంది. దీని ద్వారా వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంలో పడుతుందని నిపుణులు చెబుతున్నారు.