/rtv/media/media_files/2025/08/12/pakistan-army-chief-asim-munir-2025-08-12-08-25-22.jpg)
Pakistan Army Chief Asim Munir
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఇటీవల అణు దాడి గురించి హెచ్చరికలు చేసిన సంగతి తెలిసిందే. భవిష్యత్తులో భారత్‌తో యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు తమ దేశానికి ముప్పు ఉందని భావిస్తే.. అణు దాడులతో సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామని అమెరికా గడ్డ నుంచి ఈ బెదిరింపు వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. చాలామంది అసిమ్ మునీర్ బెదిరింపు వ్యాఖ్యలను ఖండించారు. తాజాగా అమెరికా మాజీ పెంటగాన్ అధికారి మైఖేల్ రూబిన్ కూడా ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: హెచ్ 1 బీ భారత వీసాదారులకు మరో షాక్...గ్రీన్ కార్డ్ ఇక మీ పిల్లలకు పని చేయదు..
అసిమ్ మునీర్ మాటలు ఒసామా బిన్ లాడెన్ ప్రసంగాన్ని గుర్తు చేస్తున్నాయని అన్నారు. అలాగే పాకిస్తాన్‌కు ఉగ్రవాదనికి మద్దతిచ్చే దేశాల జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. అంతేకాదు పాక్‌కు నాటోయేతర ప్రధాన మిత్రుడి హోదాను కూడా నిలిపివేయాలన్నారు. అసిమ్ మునీర్ అమెరికా గడ్డపై అలాంటి బెదిరింపు వ్యాఖ్యలు చేసినప్పుడు అమెరికన్ జనరల్స్ ఎందుకు వాకౌట్ చేయలేదని ప్రశ్నించారు. అలా చేయని జనరల్స్ రాజీనామా చేయాలని అన్నారు. పాకిస్థాన్ దీనిపై వివరణ ఇచ్చి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అప్పటివరకు అసిమ్ మునీర్‌ను, ఇతర పాకిస్థా్న్ అధికారిని పర్సనా నాన్ గ్రాట్ (ఆమోదయోగ్యం కాని వ్యక్తి)గా ప్రకటించాలన్నారు. అంతేకాదు వాళ్లకు అమెరికా వీసా కూడా లభించకూడదని తేల్చిచెప్పారు.
మరోవైపు అసిమ్ మునీర్ వ్యాఖ్యలను భారత్ కూడా తీవ్రంగా ఖండించింది. ఈ వ్యాఖ్యలు అనుచితమైనవని, బాధ్యతారాహిత్యమైనవని విదేశాంగ మంత్రిత్వ శాఖ విమర్శించింది. ఇలాంటి బెదిరింపులు ప్రాంతీయ శాంతి, భద్రతకు ముప్పు కలిగేలా ఉన్నాయని మండిపడింది. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం మానుకోవాలని, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించింది. మునీర్ బహిరంగ హెచ్చరికలను అమెరికా విదేశాంగ శాఖ కూడా ఖండించింది. అణుశక్తి కలిగిన పాకిస్థాన్.. ఓ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని చెప్పింది.
Also Read: మోదీకి రక్షణగా SPG తొలి మహిళా ఆఫీసర్.. ఎవరీ అదాసో కపేసా..?
మరోవైపు అసిమ్ మునీర్ చేసిన ప్రకటన పాక్-అమెరికా మధ్య సంబంధాలు క్లిష్టతరం చేసే అవకాశాలున్నాయని పలువురు నిపుణులు భావిస్తున్నారు. అంతేకాదు ఈ పరిణామానాలను భారత్ కూడా చాలా సీరియస్‌గా పరిశీలిస్తోంది. తమ దేశ భద్రతకు ఎలాంటి ముప్పు తలెత్తినా శత్రు దేశానికి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని తేల్చిచెప్పింది. ఇక అసిమ్ మునీర్ అమెరికాలో రాజకీయ, సైనిక నాయకులను కూడా కలిశారు. వాళ్లతో మీటింగ్ తర్వాత ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అందరిని ఆశ్చర్యపరిచాయి.
Also Read: ఇండియా-పాక్ రాయబార కార్యాలయాల్లో కీలక మార్పులు.. మళ్లీ యుద్ధం!