Crime News:  కూకట్‌పల్లిలో దారుణం..12 ఏళ్ల బాలిక దారుణ హత్య

కూకట్‌పల్లిలో దారుణం చోటు చేసుకుంది.  ఇంట్లో ఒంటరిగా ఉన్న 12 ఏళ్ల బాలికను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు డాగ్‌ స్క్వాడ్‌, క్లూస్‌ టీంతో దర్యాప్తు చేస్తున్నారు.  

New Update
murder

murder

కూకట్‌ పల్లిలో దారుణం చోటు చేసుకుంది.  ఇంట్లో ఒంటరిగా ఉన్న 12 ఏళ్ల బాలిక(minor girl case) ను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు డాగ్‌ స్క్వాడ్‌, క్లూస్‌ టీంతో దర్యాప్తు చేస్తున్నారు.  అభం శుభం తెలియని బాలికను హత్య చేయాల్సిన పని ఎవరికి ఉందనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.పోలీసులకు అందిన సమాచారం మేరకు కూకట్‌ పల్లిలోని సంగీత్‌నగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

Also Read: Janhvi Kapoor Photos: అబ్బా ! లెహంగాలో 'పరమ్ సుందరి' ఫోటోషూట్‌ అదిరింది.. కుర్రకారు ఫిదా!

Brutal Murder Of A 12-Year-Old Girl In Kukatpally

తల్లితండ్రులు ఇంట్లో లేని సమయంలో సహస్ర (12) అనే బాలికను హత్య(Murder) చేసి పారిపోయారు దుండగులు.కొడుకుకు బాక్స్ ఇచ్చేందుకు ఇంటికి వచ్చిన తండ్రికి.. ఇంట్లో బెడ్డు మీద కత్తిపోట్లతో పడిఉన్న కూతురు కనిపించడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఇంట్లో చనిపోయి ఉన్న కూతురును చూసిన తండ్రి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు కూకట్ పల్లి పోలీసులు. 

Also Read:Bezawada Bebakka: కోకాపేటలో బెజవాడ బేబక్క లగ్జరీ ఫ్లాట్.. బిగ్ బాస్ లో అంత సంపాదించిందా!

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సహస్ర తండ్రి కృష్ణ బైక్ మెకానిక్ గా పనిచేస్తుండగా,  తల్లి రేణుక ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్నారు. గత కొన్నాళ్లుగా కూకట్ పల్లిలో నివసిస్తున్నారు. ఎప్పట్లాగే తండ్రి మెకానిక్ షాపుకు, తల్లి ఉద్యోగానికి వెళ్లిన తర్వాత జరిగింది ఈ ఘటన. ఇంట్లో ఎవరు లేని సమయంలో బాలికను చంపేశారు దుండగులు. బాలిక మృతి పట్ల పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు. ఇంట్లో తాము లేని సమయంలో హత్య చేశారని రోధిస్తున్నారు. ఇంట్లో ఒకవేళ తమ కొడుకు ఉంటే అతన్ని కూడా చంపేసేవారేమోనని ఏడుస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించారు. 

హైదరాబాద్(Hyderabad) కూకట్ పల్లి పోలీస్  బృందం, డాగ్ స్కాడ్, క్లూస్ టీమ్‌లతో కలసి ఘటనపై ఆధారాలను సేకరించి దర్యాప్తు చేపట్టారు. అయితే ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఇది కూడా చూడండి: C.P. Radha Krishnan: రాధాకృష్ణన్ ర్యాలీపై బాంబుల వర్షం.. ఉపరాష్ట్రపతి అభ్యర్థి గురించి ఈ షాకింగ్ విషయాలు తెలుసా!?

Advertisment
తాజా కథనాలు