Bezawada Bebakka: కోకాపేటలో బెజవాడ బేబక్క లగ్జరీ ఫ్లాట్.. బిగ్ బాస్ లో అంత సంపాదించిందా!

బిగ్ బాస్ బేబక్క కొత్త ఇంటిని కొనుగోలు చేసింది. హైదరాబాద్ లోని కోకాపేటలో ఒక లగ్జరీ ఫ్లాట్ ని సొంతం చేసుకుంది. ఎప్పటినుంచి సొంత ఇల్లు కొనుక్కోవాలనే తన కలను సాకారం చేసుకుంది.

New Update
bezawada bebakka

bezawada_bebakka

Bezawada Bebakka: సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌  బెజవాడ బేబక్కగా అలియాస్ మధు నెక్కంటి బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్ గా బాగా పాపులరైంది. గలగలా మాట్లాడుతూ బిగ్ బాస్ హౌజ్ లోకి అడుపెట్టిన ఈమె.. దురదృష్టవశాత్తు మొదటి వారమే ఎలిమినేట్ అయ్యింది. ఉన్నది ఒక వారమే అయినప్పటికీ.. బేబక్కకి బాగానే పాపులారిటీ వచ్చింది. ఈ షోతో తర్వాత పలు టీవీ షోలు, ప్రమోషనల్ వీడియోలతో ఫుల్ బిజీ అయిపోయింది. 

బేబక్క కొత్త ఇల్లు

ఈ క్రమంలో తాజాగా బేబక్క కొత్త ఇంటిని కొనుగోలు చేసింది. హైదరాబాద్  కోకాపేటలోని ఓ అపార్ట్మెంట్ లో   లగ్జరీ ఫ్లాట్ ని సొంతం చేసుకుంది. ఎప్పటి నుంచో సొంత ఇల్లు కొనుక్కోవాలనే తన కలను సాకారం చేసుకుంది. ఈ విషయాన్ని తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా వెల్లడించింది బేబక్క. అలాగే తన గృహప్రవేశం వేడుకకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను కూడా పంచుకుంది. ఈ గృహ ప్రవేశ వేడుకకు బిగ్ బాస్ కంటెస్టెంట్స్, సినీ తారలు, అతిథులుగా వచ్చారు. హీరో శ్రీకాంత్ కూడా బేబక్క గృహప్రవేశ వేడుకలో సందడి చేశారు. ఇది చూసిన అభిమానులు  బేబక్కకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 

బిగ్ బాస్ తర్వాత బేజవాడ బేబక్క సినిమా అవకాశాలు, యూట్యూబ్ వీడియోల ద్వారా మంచి ఆదాయం సంపాదించినట్లు తెలుస్తోంది. అలా తన సొంతింటి కలను  నిజం చేసుకున్నారు. అలాగే  బిగ్ బాస్ నుంచి కూడా బేబక్కకి మంచి రెమ్యునరేషన్ అందినట్లు  సమాచారం.   ప్రస్తుతం బేబక్క  కొత్త ఇంటి వీడియో  సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

అయితే బేబక్క అపార్ట్మెంట్ లో 25వ అంతస్థులో ఉన్న ఫ్లాట్ ని  తన ఇంటిగా ఎంపిక చేసుకుంది. ఇది 3bhk ఫ్లాట్..ఇందులో 3 బెడ్ రూమ్స్, హాల్, కిచెన్ ఉంటాయి.  బేబక్క తన కొత్త ఇంట్లో పెంపుడు పిల్లి ఆడుకోవడానికి ఓ ప్రదేశాన్ని ప్రత్యేకంగా డిజైన్ చేయించిందట. అలాగే పూజ గదిని కూడా అందంగా కట్టించుకున్నట్లు తెలుస్తోంది.

కొత్త ఇంటి గృహప్రవేశం సందర్భంగా బేబక్క మాట్లాడుతూ..ఎప్పటి నుంచో సొంత కొనుక్కోవాలని అనుకుంటున్నాను..ఇన్నాళ్లకు నా సొంతింటి కళ నెరవేరింది అంటూ ఆనందం వ్యక్తం చేసింది. 

సోషల్ మీడియా ఫేమ్ తో బిగ్ బాస్ సీజన్ 8 లో అడుగుపెట్టే అవకాశం దక్కించుకుంది  బేబక్క. కానీ  ఒక్క వారంలోనే ఇంటి నుంచి బయటకు వచ్చేసింది.  హౌస్ లోకి వెళ్లే ముందు బేబక్క  స్టేజ్ పై గలగల మాట్లాడడం చూసి.. ఖచ్చితంగా 4,5 వారాలు ఉంటుందని అనుకున్నారు ప్రేక్షకులు. తీరా లోపలికి వెళ్లిన తర్వాత బేబక్క టాస్కూల్లో కంటే వంటగదిలోనే ఎక్కువగా కనిపించింది. దీంతో ఒక్క వారంలోనే ఎలిమినేటయి బయటకు వచ్చేసింది. 

Also Read: Stalin Re- Release: మెగా ఫ్యాన్స్ కి పండగ.. మరో 5 రోజుల్లో మెగాస్టార్ సూపర్ హిట్ మూవీ రీ రిలీజ్

Advertisment
తాజా కథనాలు