/rtv/media/media_files/2025/08/17/cp-lk-2025-08-17-22-51-34.jpg)
CP Radha Krishnan, LK Advani
సి.పి. రాధాకృష్ణన్‌ను ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు BJP జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు. ఉప రాష్ట్రపతి పదవికి ఎన్నిక సెప్టెంబర్ 9న జరగనుంది. బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో దక్షణాది రాష్ట్రాలకు చెందిన నాయకులకు ప్రాధాన్యత తక్కువ అనే మచ్చ ఉంది. ఆ మార్క్ తొలగించుకోడానికే బీజేపీ ఉపరాష్ట్రపతిగా సి.పి రాధాకృష్ణన్‌ను ఎన్నుకున్నట్టు తెలుస్తోంది.
సీ.పీ రాధాకృష్ణన్ కు బీజేపీ తో ఎంతో కలిసి ఎంతో కాలంగా పని చేస్తున్నారు. బీజేపీ దివంగత నేత అద్వానీతో కలిసి ఈ ఈయన పని చేసిన రోజులు కూడా ఉన్నాయి. 1998 ఏడాదిలో కేంద్రంలో బీజేపీ పట్టు బలోపేతం చేసుకుంటోంది. దక్షిణ భారతదేశం, ముఖ్యంగా తమిళనాడు, పార్టీకి కొత్త మైదానం. సిపి రాధాకృష్ణన్‌కు కోయంబత్తూర్ సీటు టికెట్ ఇచ్చారు. ఈయన ఎన్నికల ప్రచారానికి అప్పటి నేత అద్వానీ రానున్నారు. అప్పుడే ఓ అనూహ్య సంఘటన జరిగింది. తమిళనాడు చరిత్రలో ఓ చీకటి రాత్రి నమోదు చేసుకుంది.
బీజేపీ రాజకీయాల్లో కీలక మలుపు..
అప్పటికే బీజేపీకి , ముస్లిమ్ లకు మధ్య గొడవలు బాగా జరుగుతున్నాయి. ఆ ప్రభావం తమిళనాడులోని సీసీ రాధాకృష్ణన్, అద్వానీ ర్యాలీపై కూడా చూపించింది. 1997 ఫిబ్రవర్ 14 మధ్యాహ్నం కొయంబత్తూరులో ర్యాలీ వేదిక నుంచి కొన్ని కిలోమీటర్ల దూరంలో 12కు పైగా బాంబు పేలుళ్లు జరిగాయి. ర్యాలీ వైపు ప్రజలు వస్తున్న ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఈ పేలుళ్లు జరిగాయి. రద్దీగా ఉండే మార్కెట్లు, బస్ స్టేషన్లు మరియు ప్రధాన రహదారులను లక్ష్యంగా చేసుకుని బాంబులను వేశారు. దీనిలో దాదాపు 58 మంది చనిపోయారు. 200 కు పైగా గాయపడ్డారు. వీటి వెనుక అల్ ఉమ్మా అనే ఛాందసవాద సంస్థ హస్తం ఉందని తేలింది.
ఈ పేలుళ్ల తరువాత తమిళనాడులో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పెద్ద సంఖ్యలో ముస్లిం యువకులను అరెస్ట్ చేశారు. అప్పటికే బాబ్రీ మసీద్ గొడవలు నడుస్తున్నాయి. మరోవైపు దేశంలో అద్వానీ నాయకత్వంలో హిందూత్వాన్ని బలంగా చేయాలనే ప్రచారం ఊపందుకుంది. దీంతో దేశంలో ముస్లింలు చాలా కోపంగా ఉన్నారు. ఈ కారణంగానే అద్వానీ, బీజేపీ మద్దతుదారులను లక్ష్యంగా చేసుకుని పేలుళ్లను చేశారు. అయితే అద్వానీ, సీపీ రాధాకృష్ణ అదృష్టం బావనుండి...ఆ రోజు వారి కారు కాస్త ఆలస్యంగా బయలుదేరడంతో ప్రాణాలతో తప్పించుకున్నారు.
తమిళనాడు బాంబు పేలుళ్ల వెనుక ఎస్ ఏ బద్రుద్దీన్ అతని సంస్థ అల్ ఉమ్మా పై చర్చలు తీసుకున్నారు. వారి స్థావరాలపై పోలీసులు, దర్యాప్తు సంస్థలు పెద్ద ఎత్తున దాడులు చేశాయి. RDX బాంబులు, జెలటిన్ స్టిక్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో 2007లో 18 మంది దోషులకు జీవిత ఖైదు విధించారు. మరో ఇరవై మందిని సరైన ఆధారాలు లేకపోవడంతో విడిచిపెట్టారు.
కానీ తమిళనాడు బాంబు పేలుళ్లు సీపీ రాధాకృష్ణ కు బాగా కలిసి వచ్చాయి. సానుభూతితో ఎన్నికల్లో అఖండ విజయం సాధించారు. హిందూ ఓటర్లు ఆయనను భారీ మెజారిటీతో గెలిపించారు. దీంతో బీజేపీ దక్షిణ భారత్ లోకి రావడం మొదలైంది. మరోవైపు కోయంబత్తూరు పేలుడు కేవలం ఉగ్రవాద దాడి మాత్రమే కాదు, ఆ యుగ రాజకీయాల్లో ఒక కీలక మలుపు. ఆ రోజు జరిగిన పేలుళ్లలో అద్వానీ చిక్కుకుని ఉంటే.. బహుశా భారత రాజకీయాల దిశ మారి ఉండేది.