/rtv/media/media_files/2025/08/30/wife-kills-husband-2025-08-30-10-31-09.jpg)
Wife kills husband with boyfriend
Wife And Lover Kill Husband: అక్రమ సంబంధాల(Illegal Affair) నేపథ్యంలో మరో నిండు ప్రాణం బలైంది. భార్య, ఆమె ప్రియుడి చేతిలో భర్త దారుణంగా హత్యగావించబడ్డాడు. మూడు మూళ్లు వేసి అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న భర్తను భార్య.. ప్రియుడితో కలిసి హత్య చేయించింది. ఈ దారుణం వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండల కేంద్రంలో కలకలం రేపింది. - Vikarabad Family Crime
Also Read : బర్త్ డే పార్టీ.. దువ్వాడ జంటకు మరోషాక్... ఆయనకు నోటీసులు
Wife Kills Husband With Boyfriend
పరిగి డీఎస్పీ శ్రీనివాస్ కథనం ప్రకారం.. చౌడపూర్‌కు చెందిన కవిత, రత్నయ్య భార్యాభర్తలు. శనివారం గుర్తు తెలియని వాహనం ఢీకొని రత్నయ్య మృతి చెందాడు. అతని సోదరుడు దేవయ్య ఇచ్చిన ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసుల కు సంచలన విషయాలు వెలుగు చూశాయి. రత్నయ్య భార్య కవితకు అదే గ్రామానికి చెందిన దాసరి రామకృష్ణతో అక్రమ సంబంధం కొనసాగుతోంది. ఈ విషయం భర్తకు తెలియడంతో తమ అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను భార్య హత్య చేయించినట్లు తేలింది. భర్తను ట్రాక్టర్‌తో గుద్దించి చంపి.. దానిని ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్లు పోలీసులు గుర్తించారు.
రత్నయ్యను ఉదయం పొలం నుంచి ఇంటికి తిరిగి వస్తున్న రత్నయ్యను రామకృష్ణ ట్రాక్టర్‌తో బలంగా ఢీ కొట్టాడు. తీవ్రగాయాలతో అతడు అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తొలుత ప్రమాదంలో రత్నయ్య మరణించారని పోలీసులు భావించారు. రత్నయ్య మృతిపై అతడి సోదరుడు దేవయ్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు అనుమానం వ్యక్తం చేశాడు.
దీంతో పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేపట్టారు. పోలీసుల విచారణలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. భార్య కవిత, ప్రియుడు రామకృష్ణ అక్రమ సంబంధం బయట పడింది. తమ అక్రమ సంబంధానికి అడ్డోస్తున్నాడని భర్త రత్నయ్యను ప్రియుడి రామకృష్ణతో కలిసి హత్య చేసినట్లు పోలీసుల ఎదుట వారిద్దరూ నేరం అంగీరించారు. దాంతో వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోస్ట్‌మార్టం నిమిత్తం రత్నయ్య మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Also Read : హెడ్‌మాస్టర్ తిట్టాడని.. క్లాస్‌కు రివాల్వర్ తీసుకొచ్చి బెదిరించిన విద్యార్థి
Follow Us