/rtv/media/media_files/2025/12/14/odisha-student-14-brings-revolver-to-classroom-2025-12-14-20-27-00.jpg)
Odisha Student 14 Brings Revolver To Classroom
యానిమాల్(animal) మూవీలో రణ్‌బీర్ కపూర్(Ranbir Kapoor) స్కూల్‌కు గన్ తీసుకొచ్చి క్లాసులో పేల్చే సీన్ అందరినీ ఆశ్చర్యపరిచింది. కానీ నిజ జీవింతలో స్కూల్‌కు విద్యార్థులు అలా గన్ తీసుకురావడం అసాధ్యమే. కానీ ఇలాంటి ఘటనే ఒడిశాలో జరిగింది. ఓ విద్యార్థి స్కూల్‌కు రివాల్వార్ తీసుకొచ్చి తనని తిట్టిన హెడ్‌మాస్టర్‌ను గన్‌తో బెదిరించాడు. సమాచారం మేరకు స్కూల్‌కు వచ్చిన పోలీసులు ఆ విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
Also Read: బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బిహార్ మంత్రి..
Odisha Student 14 Brings Revolver To Classroom
ఇక వివరాల్లోకి వెళ్తే.. కేంద్రపారా జిల్లాలోని కోరువాలో ప్రభుత్వ హైస్కూల్‌లో 14 ఏళ్ల బాలుడు 9వ తరగతి చదవుతున్నాడు. క్లాస్‌రూమ్‌లో తనను ప్రధానోపాధ్యాయుడు తిట్టాడనే కోపంతో శనివారం దేశీయ రివాల్వర్‌తో స్కూల్‌కు వచ్చాడు. తనను తిట్టిన హెడ్‌మాస్టర్‌తో పాటు, టీచర్లను ఆ గన్‌తో బెదిరించాడు. ఆ బాలుడి చేతిలో రివాల్వర్‌ను చూసి వారు షాకైపోయారు. సమాచారం మేరకు స్కూల్‌కు వచ్చిన పోలీసులు ఆ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు.
Also Read: కమ్యూనిస్టుల కంచు కోట బద్దలు.. కేరళ లోకల్ ఎలక్షన్స్ లో దుమ్ములేపిన BJP
దేశీయ రివాల్వర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ బాలుడిని జువైనల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపర్చారు. ఆ తర్వాత స్పెషల్ హోమ్‌కు తరలించారు. అయితే ఆ తుపాకీ బాలుడి వద్దకు ఎలా వచ్చింది అనే దానిపై అతడి తల్లిదండ్రులను, బంధువులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
Also Read: ఆ గ్రామంలో టై అయిన పోలింగ్.. లక్కి డ్రాలో సర్పంచి పదవి
Follow Us