నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. కీలక బిల్లులు ప్రవేశపెట్టనున్న సర్కార్‌..!!

నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు షురూ కానున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ జరుగుతున్న ఈ సమావేశంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు అస్త్రాలతో సిద్ధమయ్యాయి. ప్రతిపక్షాల ఎత్తుకు పైఎత్తులతో అధికారపార్టీ రెడీ అవుతోంది. మొత్తానికి ఈ సమావేశాలు వాడీవేడీగా జరిగే అవకాశం ఉంది.

నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. కీలక బిల్లులు ప్రవేశపెట్టనున్న సర్కార్‌..!!
New Update

Telangana Assembly Sessions: ఇవాళ్టి నుంచి తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా సాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా పలు అంశాల్లో ప్రతిపక్ష పార్టీలను ఎండగట్టేందుకు అధికార పార్టీ బీఆర్ఎస్(BRS) రెడీ అవుతోంది. ఇటు అధికారి పార్టీని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకున్నాయి. ఇప్పటికే తెలంగాణ గవర్నర్ కు ప్రభుత్వానికి మధ్య సయోధ్య లేకపోవడంతో అనేక బిల్లులను గవర్నర్ తిప్పి పంపిన వ్యవహారంలో బీజేపీని(BJP) టార్గెట్ చేసి తీవ్ర స్థాయిలో విరుచుకుపడేందుకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. అలాగే ఉచిత విద్యుత్ విషయంలోనూ కాంగ్రెస్ తీరును ఎండగట్టి...కాంగ్రెస్(Congress) పనితీరును ప్రజలకు అర్థమయ్యే సభ ద్వారా సీఎం కేసీఆర్(CM KCR) వివరించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇవే చివరి సమావేశాలు కావడంతో ప్రభుత్వం కీలక బిల్లులను ప్రవేశపెట్టి..ఆమోదించబోతోంది.

ఇక ఆర్టీసీ(TSRTC) ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులగా గుర్తిస్తూ నిర్ణయం తీసుకోనున్నారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత నిర్వహించే బీఏసీ సమావేశంలో ఎన్నిరోజులు సమావేశాలు నిర్వహించాలన్న అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తుండటం, సెప్టెంబర్ లోనే ఎన్నికల షెడ్యుల్ వచ్చే అవకాశం ఉండటంతో..ఆగస్టులోనే అసెంబ్లీ సమావేశాలు(Telangana Assembly) నిర్వహించాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమావేశాల్లో ప్రభుత్వం కీలక ప్రకటనలు చేయనుంది. ఈ ఏడాదికి సంబంధించి ఇవే చివరి సమావేశాలు కావడంతో అన్ని వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది. ఎన్నికలే లక్ష్యంగా బీఆర్ఎస్ ఏవైనా ప్రకటనలు చేస్తుందా అన్న చర్చకూడా మొదలైంది. దీనికోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల ముందు జరుగుతున్న ఈ చివరి సమావేశాలపై రాజకీయ వర్గాల్లోనూ తీవ్రస్థాయిలో ఆసక్తి నెలకొంది.

మరోవైపు బీఆర్ ఎస్ టార్గెట్ గా బీజేపీ వేరే ప్లాన్స్ లో ఉంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ వైఫల్యాలను, ప్రజావ్యతిరేక విధానాలపై అంశాల వారీగా ఆందోళన నిర్వహించాలని బీజేపీ డిసైడ్ అయ్యింది. డబుల్ బెడ్ డ్రూం ఇళ్లు, దళితబంధు వంటి ప్రధాన అంశాలపై అధికారపార్టీని ఇరుకున పెట్టేందుకు బీజేపీ రెడీ అవుతోంది.

అయితే బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇవే చివరి అసెంబ్లీ సమావేశాలు అవ్వడంతో గత తొమ్మిదేళ్లలో ప్రభుత్వం చేసిన పనులు, ప్రభుత్వ విజయాలను అసెంబ్లీ వేదికగా వివరించనున్నారు. విపక్షాలు పలు సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చేందుకు వివరాల సేకరణలో మంత్రులు ఉన్నారు. బీజేపీ,కాంగ్రెస్ లక్ష్యంగా విమర్శనాస్త్రాలను సంధించాలని భావిస్తున్నారు. మొత్తానికి ప్రతిపక్షాలను ఇరుకున పెట్టేందుకు అధికార పార్టీ... ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు రెడీగా ఉన్నాయి.

Also Read: ఇవాళ్టి నుంచి రుణమాఫీ.. రైతన్నకు కేసీఆర్ వరాలు

#brs #congress #bjp #cm-kcr #telangana-assembly #telangana-politics #telangana-assembly-sessions #plan #assembly-meetings #telangana-assembly-latest-news #telangana-assembly-live
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe