Telangana Assembly : మార్చి 12 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు తేది ఖరారైంది. మార్చి 12 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఈ రోజు సమావేశమైన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ సమావేశాలు మార్చి 27వ తేదీ వరకూ కొనసాగనున్నాయి.