Crime News : వరంగల్లో యువకుడి కిడ్నాప్ నాటకం..తండ్రికి ఫోన్ చేసి....
వరంగల్ నగరంలో ఓ యువకుడి కిడ్నాప్ కలకలం రేపింది. ఈ ఘటన మట్టేవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం సాయంత్రం సుమారు ఏడు గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. అబిత్ కుమార్ అనే యువకుడిని గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని తెలియడంతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.