/rtv/media/media_files/2026/03/08/cm-revanth-reddy-2026-03-08-14-38-38.jpg)
CM Revanth Says govt considering providing free electric scooters to girl students
సీఎం రేవంత్ కీలక ప్రకటన చేశారు. కాలేజీకి వెళ్లే విద్యార్థినులకు ఈవీ స్కూటీలు ఇవ్వాలని అనుకుంటున్నామని చెప్పారు. ప్రజాభవన్‌లో నిర్వహించిన మహిళా దినోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌ను కాలుష్య రహిత నగరంగా మారుస్తున్నామని పేర్కొన్నారు. రెడ్, ఆరెంజ్ కేటగిరి పరిశ్రమలను ఓఆర్‌ఆర్ బయటకు పంపిస్తామన్నారు. మహిళా జర్నలిస్టులతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం ఆనందంగా ఉందన్నారు.
Also Read: ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం గుడ్ న్యూస్..త్వరలోనే వారికి ఇళ్లు
మహిళలకు సరైన గుర్తింపు ఇవ్వాలని తమ ప్రభుత్వం భావిస్తోందని.. పోలీస్‌తో పాటు ఇతర విభాగంలో మహిళా అధికారులకు కీలక బాధ్యతలు అప్పగిస్తున్నామని తెలిపారు. మహిళల ఆర్థిక శక్తి పెరిగినప్పుడే దేశ అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. అలాగే హైదరాబాద్‌లో డీజిల్ బస్సులను 2026 డిసెంబర్ నాటికి జిల్లాలకు తరలిస్తామని తెలిపారు.
Also Read: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో పొగలు.. భయంతో పరుగులు తీసిన ప్రయాణీకులు
హైదరాబాద్‌లో 100 శాతం ఎలక్ట్రిక్ వెహికిల్ (EV) బస్సులను తీసుకొస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది డిసెంబర్ 9 నాటికి నగరంలో డీజిల్ బస్సులు ఉండవన్నారు. అంతేకాదు నగరంలో ఏసీ ఈవీ బస్సులు కూడా తీసుకొస్తామని హామీ ఇచ్చారు. కాలేజీలకు వెళ్లే విద్యార్థినులకు ఈవీ స్కూటీలు ఇవ్వాలనుకుంటున్నామని స్పష్టం చేశారు. ఇదిలాఉండగా అసెంబ్లీ ఎన్నికలకు ముందు విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామని కాంగ్రెస్ తమ మెనిఫెస్టోలో హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే విద్యార్థినులకు స్కూటీలు పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
Live: Hon’ble Chief Minister A. Revanth Reddy will participate in the International Women's Day celebrations, honoring the achievements, strength, and contributions of women across society. https://t.co/iDPd5HnFdt
— Revanth Reddy (@revanth_anumula) March 8, 2026
Follow Us