Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం గుడ్ న్యూస్..త్వరలోనే వారికి ఇళ్లు

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపేదలకు ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తామని హమీ ఇచ్చింది. ఇప్పటివరకు చాలాచోట్ల పథకం అందక ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. త్వరలోనే అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని స్పష్టం చేసింది.

New Update
Indiramma House

Indiramma House

Indiramma Houses : తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే పేదలకు ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తామని హమీ ఇచ్చింది. అయితే ఇప్పటి వరకు కొన్ని ప్రాంతాల్లో ఇళ్లు మంజూరు అయినప్పటికీ చాలాచోట్ల పథకం అందక అనేకమంది ఇబ్బందులు పడుతున్నారు.ఈ క్రమంలో ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. త్వరలోనే అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని స్పష్టం చేసింది. కాగా తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలివిడతలో 3.60 లక్షల ఇళ్లను మంజూరు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. రెండో విడతలో మరికొంత మందికి ఇళ్లు అందించేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది
 
కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలకు అనేక సౌకర్యాలు కల్పిస్తామని హమీ ఇచ్చింది. అందులో ఇందిరమ్మ ఇళ్లు ఒకటి. నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని చెప్పింది. అయితే చాలామందికి ఇప్పటివరకు ఇళ్లు రాలేదు. దీంతో  తెలంగాణలో చాలామంది ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఇళ్లకోసం ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న వారిలో.. ప్రభుత్వం తొలి విడతలో 3.60 లక్షల ఇళ్లు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మంజూరు చేసినట్లు చెబుతోంది. సొంత స్థలం ఉండి కొత్తగా ఇల్లు నిర్మించుకోవాలనుకునేవారికి రూ.5 లక్షల ఆర్ధిక సాయం అందించినట్లు చెప్పింది.  కాగా ఈ మొత్తాన్ని ఇళ్లు పూర్తయ్యేలోపు  లబ్దిదారుల అకౌంట్లో నేరుగా జమ చేస్తోంది.ఇప్పటికే వీటిల్లో చాలా ఇళ్లు గృహప్రవేశాలు పూర్తి చేసుకోగా.. మరికొన్ని ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. కాగా ఈ నెలాఖరు నాటికి లక్ష ఇళ్లకు గృహప్రవేశాలు చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  ప్రస్తుతం తొలి దశలో మంజూరు చేసిన ఇళ్లన్నీ గ్రౌండింగ్ పూర్తి చేసేల ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

మొదటి దశ ఇళ్లు పూర్తవుతున్న తరుణంలో రెండవ దశ ఇళ్ల విడుదలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  ఏప్రిల్‌లో రెండవ దశ కింద కొత్త ఇళ్లను మంజూరు చేసేందుకు సిద్దమవుతోంది. ఇప్పటివరకు కేవలం 20 శాతం ఇళ్లు గ్రౌండింగ్ పూర్తి కాగా  మార్చి 31లోపు ఇళ్లన్నీ గ్రౌండింగ్ పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.  అలా జూన్ చివరి నాటికి ఇళ్లన్నీ పూర్తయ్యేలా లబ్దిదారులకు ప్రభుత్వం దిశానిర్దేశం చేస్తోంది. అటు డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకానికి సంబంధించి కూడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. మార్చి 31లోపు డబుల్ బెడ్ రూం ఇళ్లకు సంబంధించి అర్హైలైన వారిని ఎంపిక చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. స్థలం లేని నిరుపేదలకు వీటిని కేటాయించాలని నిర్ణయించింది. త్వరలోనే ఇళ్లులేని పేదలందరికీ పట్టణ ప్రాంతాల్లో నిర్మితమైన డబుల్‌ బెడ్రూం ఇళ్ల లో ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పించింది.

Advertisment
తాజా కథనాలు