/rtv/media/media_files/2026/03/08/kaveri-travels-bus-2026-03-08-07-29-49.jpg)
kaveri travels bus
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈరోజు (మార్చి 8, 2026) తెల్లవారుజామున ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు(Private Travels Bus Acci*dent) లో పొగలు రావడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. చౌటుప్పల్ మండలం(Choutuppal), పంతంగి టోల్‌గేట్(Pantangi Toll Gate) సమీపంలో, హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి చెన్నైకి వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు(kaveri travels bus) ఇంజిన్ నుంచి అకస్మాత్తుగా పొగలు రావడంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.బస్సు పంతంగి టోల్‌గేట్ వద్దకు చేరుకోగానే అకస్మాత్తుగా ఇంజిన్ భాగం నుండి దట్టమైన పొగలు రావడం మొదలైంది. ఇది గమనించిన డ్రైవర్ వెంటనే బస్సును పక్కకు నిలిపివేశారు.
Also Read : సీఎం రేవంత్ ముందు 130 మంది మావోయిస్టులు లొంగుబాటు
Smoke In Private Travels Bus
బస్సు నిండా పొగలు కమ్ముకోవడంతో లోపల ఉన్న ప్రయాణికులు ఊపిరాడక, ప్రాణభయంతో కేకలు వేస్తూ ఒకేసారి కిందకు దిగి పరుగులు తీశారు.ప్రమాద సమయంలో బస్సులో ఉన్న వారందరూ సురక్షితంగా బయటపడటంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది.ఈ ఘటన హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న పంతంగి టోల్‌గేట్ వద్ద జరడంతో కొంతసేపు హైవేపై ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే బస్సులో చిన్న సాంకేతిక సమస్య వచ్చిందని, ఎలాంటి ప్రమాదం లేదని డ్రైవర్ చెప్పి తిరిగి బస్సు బయలుదేరడానికి సిద్ధమైనప్పటికీ అదే బస్సులో ప్రయాణించడానికి ప్రయాణికులు నిరాకరించారు. వేరే బస్సు ఏర్పాటు చేయాలని టోల్‌గేట్ వద్ద ఆందోళనకు దిగారు.
బస్సులో పొగలు రావడంతో ప్రయాణికులు రోడ్డుపైనే నిలిచిపోయారు. అనేక తర్జనభర్జనల అనంతరం కావేరి ట్రావెల్స్ యాజమాన్యం హైదరాబాద్ నుండి మరో ఖాళీ బస్సును అత్యవసరంగా పంపించింది. కొత్త బస్సు రావడానికి సుమారు 2 నుండి 3 గంటల సమయం పట్టింది. అప్పటివరకు ప్రయాణికులు చలిలో, టోల్‌గేట్ సమీపంలోని ప్రదేశాల్లో వేచి చూడాల్సి వచ్చింది. ఉదయం సుమారు 7:30 - 8:00 గంటల ప్రాంతంలో ప్రత్యామ్నాయ బస్సు చేరుకుంది. ప్రయాణికులందరినీ ఆ బస్సులోకి ఎక్కించి విజయవాడ, చెన్నై వైపు పంపించారు. పాత బస్సు నుండి లగేజీని కొత్త బస్సులోకి మార్చుకోవడంలో ప్రయాణికులు కొంత ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లలు ఉన్న కుటుంబాలు ఈ ఆలస్యం వల్ల ఇబ్బంది పడ్డారు.
చౌటుప్పల్ పోలీసులు ఘటనా స్థలంలోనే ఉండి, ప్రయాణికులందరూ సురక్షితంగా మరో బస్సు ఎక్కే వరకు పర్యవేక్షించారు. ప్రయాణికులకు అవసరమైన తాగునీరు వంటి కనీస సదుపాయాలను టోల్‌గేట్ సిబ్బంది సహకారంతో అందించారు. ప్రస్తుతం ఆ మార్గంలో ట్రాఫిక్ పునరుద్ధరించబడింది.పొగలు వచ్చిన పాత బస్సును హైవే పక్కకు తొలగించి, మెకానిక్ ద్వారా తనిఖీలు చేయిస్తున్నారు.ఇటీవల కాలంలో ప్రైవేట్ బస్సుల్లో ఇలాంటి సాంకేతిక లోపాలు, అగ్నిప్రమాదాలు ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా సుదూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో ఇంజిన్ వేడెక్కడం లేదా షార్ట్ సర్క్యూట్ వల్ల ఇలాంటివి జరుగుతుంటాయి. కనుక ప్రయాణీకుల తగిన జాగ్రత్తలు పాటించాలి.
Also Read : చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ అవార్డు, కమల్ హాసన్‌కు పైడిజయరాజ్ అవార్డు
Follow Us