WhatsApp Close: రేపటి (జూన్ 1)నుంచి ఈ ఫోన్లలో వాట్సాప్ పని చేయదు.. వెంటనే మొబైల్ మార్చండి!!

రేపటి (జూన్ 1) నుంచి పాత మోడల్ ఫోన్లలో వాట్సాప్ సర్వీస్ నిలిపేస్తున్నట్లు మెటా ప్రకటించింది. పాత ఆండ్రాయిడ్, iOS ఫోన్లలో ఈ యాప్ పని చేయదు. ఐఫోన్ 5S, 6, 6+,6S, ఐఫోన్ SE, అలాగే మోటో, శామ్సంగ్, LG కంపెనీలోని కొన్ని మోడల్స్ ఫోన్‌లో వాట్సాప్ సపోర్ట్ చేయదు.

New Update
WhatsApp ending

ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ యూజర్లకు షాకింగ్ న్యూస్ చెప్పింది. ఓల్డ్ స్మార్ట్‌ఫోన్‌లలో వాట్సాప్ యాప్ సర్వీస్ నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. 2025 జూన్ 1 నుంచి మెటా యాజమాన్యంలోని నడుస్తున్న యాప్ వాట్సాప్ కొన్ని పాత ఆండ్రాయిడ్, iOS ఫోన్లలో పని చేయదు. ఐఫోన్, సోనీ, మోటో, శామ్సంగ్, LG కంపెనీలోని కొన్ని మోడల్స్ ఫోన్‌లో వాట్సాప్ సపోర్ట్ చేయదు.

Also Read: ఓటమి ఒప్పుకున్న పాక్ ప్రధాని.. మీడియా ముందు షాకింగ్ కామెంట్స్

WhatsApp Close Older Phones

ప్రపంచవ్యాప్తంగా 3.5 బిలియన్లకు పైగా వాట్సాప్ యూజర్లు ఉన్నారు. వాట్సాప్ ప్రపంచంలోనే ఎక్కువమంది ఉపయోగించే ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్. కొత్త ఫీచర్లు, సెక్యూరిటీ అప్డేట్స్ సమర్థవంతంగా అమలు చేయడానికి, వాట్సాప్ క్రమం తప్పకుండా పాత సాఫ్ట్‌వేర్ వెర్షన్‌లకు సపోర్ట్ నిలిపివేస్తుంది. ఆయా మోడల్ స్మార్ట్‌ఫోన్లలో మేలోనే సర్వీసులు నిలిపివేస్తామని మెటా ప్రకటించింది. తర్వాత యూజర్లు కొత్త మెబైల్స్‌కు మారడానికి గడువు పొడిగించింది. జూన్ 1లోపే మీ వాట్సాప్ అకౌంట్ డేటాను బ్యాకప్ చేసుకోండి. అంతేకాదు.. ఈ మొబైల్స్ మీరు వాడుతున్నట్లైతే వెంటనే కొత్త ఫోన్ కొనుక్కోండి. లేదంటే మీ వాట్పాప్ లాగిన్ కోల్పోతారు.

Also Read: ఇండియాలో సివిల్ డిఫెన్స్ మాక్‌డ్రిల్ వాయిదా.. ఎందుకంటే?

వాట్పా్ప్ పని చేయని ఫోన్లు ఇవే>>
iOS వెర్షన్‌లు

ఐఫోన్ 5ఎస్
ఐఫోన్ 6
ఐఫోన్ 6 ప్లస్
ఐఫోన్ 6ఎస్
ఐఫోన్ 6ఎస్ ప్లస్
ఐఫోన్ SE (1వ జనరేషన్)

Also Read: ఓటమి ఒప్పుకున్న పాక్ ప్రధాని.. మీడియా ముందు షాకింగ్ కామెంట్స్


మీరు iOS 16 లేదా ఆ తర్వాతి వెర్షన్‌కి అప్‌డేట్ చేయకపోతే, జూన్ 1 నుంచి ఫోన్‌లో  WhatsApp యాక్సెస్‌ అవ్వలేరు.

ఆండ్రాయిడ్ 5.0 లేదా అంతకంటే పాత ఫోన్లలో వాట్సాప్ ఇకపై సపోర్ట్ ఇవ్వదు. అవి ఇవే
శామ్సంగ్ గెలాక్సీ S4
శామ్సంగ్ గెలాక్సీ నోట్ 3
సోనీ ఎక్స్‌పీరియా జెడ్ 1
ఎల్జీ జి2
హువావే అసెండ్ పి6
మోటో జి (1వ జనరేషన్)
మోటరోలా రేజర్ HD
మోటో E (2014)

Also Read :  పాక్‌కు గూఢచర్యం..మరో ఇంటిదొంగ అరెస్ట్‌... భారత యుద్ధ నౌకల సమాచారం చేరవేసిన ఇంజినీర్

whatsapp-updates | whatsapp-upcoming-feature | android-phones | support | latest telugu movie releases | tech-news-telugu | motorola | samsung

Advertisment
తాజా కథనాలు