Whatsapp Upcoming Feature : వాట్సాప్ యూజర్లకు గుడ్‌న్యూస్.. త్వరలోనే కిరాక్ ఫీచర్.. ఇక మల్టీ అకౌంట్ యాక్సెస్..!!
వాట్సాప్ (WhatsApp) ఒక కొత్త ఫీచర్‌పై పని చేస్తోంది. దీని ద్వారా మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రస్తుతం జరుగుతున్నట్లుగా ఒకే యాప్‌లో మల్టిపుల్ అకౌంట్స్ ను ఓపెన్ చేసుకోవచ్చు. ఒక ఖాతా నుండి మరొక ఖాతాకు వెళ్లడానికి, మీరు దానిని మార్చవలసి ఉంటుంది. ఈ రకమైన ఫీచర్‌ను ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌లో మెటా అందించింది.