Gunadala Flyover : గుణదల బ్రిడ్జికి మోక్షం ఎప్పుడు?.. మహాధర్నాకు సీపీఎం పిలుపు
వేలాది మంది ప్రజల రాకపోకలకు అవసరమైన విజయవాడ, గుణదల ఫ్లైఓవర్ బ్రిడ్జి మొండి గోడలతో మిగిలిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సీహెచ్ బాబురావు ఫైర్ అయ్యారు. నేడు స్థానిక ప్రజలతో కలిసి బాబురావు ఈ ప్రాంతాన్ని పరిశీలించారు. మొండి గోడలపై 5354 రోజులు గుర్తు చేస్తూ అంకెలు వేసి, నిరసన తెలిపారు. ఈనెల 26వ తేదీన మహాధర్నాకు పిలుపు ఇచ్చారు.