/rtv/media/media_files/2025/09/05/motorola-edge-60-neo-2025-09-05-17-53-12.jpg)
Motorola Edge 60 Neo
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ మోటరోలా కొత్త కొత్త మొబైల్స్‌ను మార్కెట్‌లో లాంచ్ చేస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. అధునాతన ఫీచర్లు, అతి తక్కువ ధరలలో ఫోన్లను రిలీజ్ చేస్తూ అందిరినీ అట్రాక్ట్ చేస్తుంది. ఈ మోటరోలా కంపెనీ ఎడ్జ్ 60 నియో(Motorola Edge 60 Neo)ను తాజాగా గ్లోబల్ మార్కెట్లో విడుదల చేసింది. ఇది కంపెనీ ఎడ్జ్ సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్‌గా వచ్చింది. కంపెనీ గత సంవత్సరం ఎడ్జ్ 50 నియోను పరిచయం చేసిన విషయం తెలిసిందే. ఈ స్మార్ట్‌ఫోన్ 6.4 అంగుళాల ఫ్లాట్ పోల్డ్ LTPO డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్, 12 GB RAMతో వచ్చింది. ఇప్పుడు Edge 60 Neo స్మార్ట్‌పోన్ ధర, ఫీచర్ల గురించి పూర్తిగా తెలుసుకుందాం.
Also Read : ఇండియాలో టెస్లా ఫస్ట్ కారు కొన్నది ఈయనే
Motorola Edge 60 Neo Price
Motorola Edge 60 Neo స్మార్ట్‌ఫోన్ తాజాగా విడుదల అయింది. ఇది త్వరలో యూరప్(Europe) లో అమ్మకానికి అందుబాటులోకి రానుంది. దీని అనంతరం ఈ స్మార్ట్‌ఫోన్‌ను భారతదేశంతో సహా ఇతర అంతర్జాతీయ మార్కెట్లో లాంచ్ చేసే అవకాశం ఉంది. ఇది రెండు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. అందులో 8 GB RAM + 128 GB స్టోరేజ్, 12 GB ర్యామ్+ 256 GB స్టోరేజ్ వేరియంట్‌లు ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర సుమారు రూ. 41,150 గా ఉంది. ఇది పాంటోన్ లాట్టే, పాంటోన్ ఫ్రాస్ట్‌బైట్, పాంటోన్ పాయిన్సియానా, పాంటోన్ గ్రిసైల్లె కలర్‌లలో అందుబాటులోకి వచ్చింది.
🚨 Motorola just unveiled the Moto Edge 60 Neo at IFA 2025!
— THE HUNT (@The_Hunt_x) September 5, 2025
With a blazing 3000 nits pOLED display, IP68 + IP69 protection, and a powerful Dimensity 7400 chip, this device is built to impress. 📱⚡
🔥 Slim design, flagship features, and a massive 5,000mAh battery — are you ready… pic.twitter.com/51ZMhB6a1b
Also Read : ఊరమాస్ సేల్ రెడీ.. స్మార్ట్‌ఫోన్స్, టీవీలు, ఎలక్ట్రానిక్స్‌పై బంపరాఫర్లు ఇవే..!
Motorola Edge 60 Neo Specifications
Motorola Edge 60 Neo డ్యూయల్ సిమ్ (నానో)తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.4-అంగుళాల ఫ్లాట్ పోల్డ్ LTPO డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 1.5K రిజల్యూషన్, 3,000 నిట్‌ల పీక్ బ్రైట్‌నెస్ స్థాయిని కలిగి ఉంది. దీని డిస్‌ప్లే కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ అందించారు. దీనికి మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్ అమర్చారు.
ఈ స్మార్ట్‌ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్ ఉంది. అవి 50-మెగాపిక్సెల్ సోనీ ప్రైమరీ కెమెరా, 13-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, 10-మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం ముందు భాగంలో 32-మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంది. కనెక్టివిటీ కోసం ఇది 4G, 5G, Wi-Fi, బ్లూటూత్, GPS, USB టైప్-C పోర్ట్ ఎంపికలను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 68 W టర్బో ఛార్జింగ్, 15 W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతుతో 5,000 mAh బ్యాటరీతో వస్తుంది.