Tesla Car In India: ఇండియాలో టెస్లా ఫస్ట్ కారు కొన్నది ఈయనే

ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా, ఎట్టకేలకు భారత మార్కెట్లో తన తొలి కారును డెలివరీ చేసింది. మహారాష్ట్ర రవాణా శాఖ మంత్రి ప్రతాప్ సర్నాయక్ ముంబైలోని టెస్లా కొత్త షోరూమ్‌లో బోణి చేశారు.

New Update
tesla first car

ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక ఎలక్ట్రిక్ కార్ల(Electric Cars) తయారీ సంస్థ టెస్లా(tesla), ఎట్టకేలకు భారత మార్కెట్లో తన తొలి కారును డెలివరీ చేసింది. మహారాష్ట్ర రవాణా శాఖ మంత్రి ప్రతాప్ సర్నాయక్ ముంబైలోని టెస్లా కొత్త షోరూమ్‌లో బోణి చేశారు. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో ఉన్న టెస్లా(Tesla) మొదటి 'ఎక్స్‌పీరియన్స్ సెంటర్' నుంచి ఆయన వైయిట్ కలర్ 'మోడల్ Y' కారును తీసుకున్నారు.

Also Read :  షాకింగ్ న్యూస్.. 43 మంది మృతి - హెచ్చరిక జారీ చేసిన ప్రభుత్వం

Tesla First Car In India

ఇండియా మార్కెట్‌(india Market) లో టెస్లా కార్ల ఎంట్రీ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఇటీవలే ముంబైలో తొలి షోరూంను ప్రారంభించిన టెస్లా, మోడల్ వై కార్ల బుకింగ్స్ కూడా మొదలుపెట్టింది. చైనాలోని షాంఘై ఫ్యాక్టరీలో తయారైన ఈ కార్లను భారత్‌కు దిగుమతి చేసుకుని అమ్ముతోంది. మొదటి డెలివరీని అందుకున్న మంత్రి ప్రతాప్ సర్నాయక్, పర్యావరణహిత వాహనాల పట్ల ప్రజల్లో అవగాహన పెంచేందుకే ఈ కారును కొనుగోలు చేసినట్లు తెలిపారు.

Also Read :  పిల్లలు తినే చాకెట్ల పైనా పన్ను..జీఎస్టీ మార్పుల తర్వాత కాంగ్రెస్ పై మోదీ విమర్శ..

రవాణా శాఖ మంత్రిగా తాను దేశంలో తొలి టెస్లా కారును కొనుగోలు చేయడం చాలా గర్వంగా ఉందని ఆయన అన్నారు. ఈ కారు తన మనవడికి గిఫ్ట్‌ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. దీనిద్వారా పర్యావరణ పరిరక్షణ, సుస్థిర రవాణా పద్ధతుల గురించి యువతలో చైతన్యం తీసుకురావాలన్నది తన లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాల ప్రోత్సాహానికి పలు చర్యలు తీసుకుందని, రాబోయే దశాబ్దంలో ఈవీల వాడకాన్ని పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు.

మోడల్ Y కారు రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. రియర్-వీల్ డ్రైవ్ వేరియంట్ ధర సుమారు రూ. 59.89 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఒకసారి ఛార్జింగ్ చేస్తే 500 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. మరోవైపు, లాంగ్ రేంజ్ రియర్-వీల్ డ్రైవ్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 67.89 లక్షలు కాగా, ఇది 622 కిలోమీటర్ల వరకు ప్రయాణ సామర్థ్యం కలిగి ఉంది. అయితే, తొలి డెలివరీతో భారత్ లో టెస్లా ప్రయాణం మొదలైనా, దేశంలో దీని అమ్మకాలు అంత ఆశాజనకంగా లేవని నివేదికలు చెబుతున్నాయి. అధిక దిగుమతి సుంకాల వల్ల ధర ఎక్కువగా ఉండటం ప్రధాన కారణంగా భావిస్తున్నారు. ఈ ఏడాది కేవలం 350-500 కార్లను మాత్రమే దిగుమతి చేయాలని టెస్లా భావిస్తున్నట్లు సమాచారం. అయితే, భవిష్యత్తులో భారత్‌లో ప్లాంట్ ఏర్పాటు చేస్తే ధరలు తగ్గవచ్చని నిపుణులు భావిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు